Koram Kanakaiah : ఇల్లందు నియోజకవర్గంలో సర్వే అంటున్నారు.. ఎప్పుడు చేస్తారు?

ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా... మెడికల్ కాలేజీలో అధిక ఫీజులతో పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేస్తున్న పొంగిలేటిని ధృత రాష్ట్రుడిగా పోల్చడం సరికాదన్నారు.

Koram Kanakaiah : ఇల్లందు నియోజకవర్గంలో సర్వే అంటున్నారు.. ఎప్పుడు చేస్తారు?

కోరం కనకయ్య (Photo: Facebook)

Koram Kanakaiah – Yellandu: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar), ఎమ్మెల్యే హరిప్రియ (Haripriya) చేసిన కామెంట్స్ పై జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య స్పందించారు. జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరేవారు రాజీనామా ఎందుకు చేయరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల్లో ఎన్నికలు వస్తాయంటూ… దాడులు చేయండి అని మంత్రి పిలుపునివ్వడం ప్రజాస్వామ్యమా? ఇతర పార్టీలు కూడా ఆలోచించాలన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) ఇల్లందులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే హరిప్రియ కామెంట్స్ పై జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య స్పందించారు.

నాలుగు పార్టీలు మారి వచ్చిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే హరిప్రియ.. రాజీనామా చేసే బీఆర్ఎస్ లో చేరారా? అని ప్రశ్నించారు. తమ చరిత్ర తెలుసుకోకుండా ఇతరులపై బురదచల్లే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇసుక దందా జరుగుతుందన్నారు. జిల్లాలో మంత్రి ఆధ్వర్యంలోనే ఇసుక దందా సాగుతుందని ఆరోపించారు.

Chandrababu : వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు సెటైర్లు

ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా… మెడికల్ కాలేజీలో అధిక ఫీజులతో పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేస్తున్న పొంగిలేటిని ధృత రాష్ట్రుడిగా పోల్చడం సరికాదన్నారు. ధృతరాష్ట్రుడు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. రైతు కుటుంబం నుంచి వచ్చి… చిన్న కాంట్రాక్టర్ గా ఉంటూ అంచలంచలుగా ఎదిగిన వ్యక్తి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి… తన సంపాదనలో సేవాగుణంతో సహాయం చేస్తున్న వ్యక్తి అని అన్నారు.

ఇల్లందు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోల్లపాడు ప్రాజెక్టు గురించి మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రోల్లపాడు ప్రాజెక్టు నీటిని మంత్రి పువ్వాడ పాలేరుకు.. మాజీ మంత్రి తుమ్మల మరోవైపుకు తీసుకుపోయారని తెలిపారు.

Tarun Chugh : తొమ్మిదేళ్ల బీజేపీ పాలన సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం పేరుతో దేశ వ్యాప్తంగా ర్యాలీలు : తరుణ్ చుగ్

ఇప్పుడు ఎన్నికల సమయం రాగానే ఇల్లందు నియోజకవర్గంలో మళ్లీ సర్వే అంటున్నారు? ఇంకా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నించారు. ఇల్లందు నియోజకవర్గానికి నీరు ఇచ్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు నీరు వెళ్తాయని.. నాడు ఎమ్మెల్యేగా ఉన్న తనకు స్వయంగా సీఎం కేసీఆర్ తెలిపారని.. అప్పుడు చెప్పిన మాట ఏమైందని నిలదీశారు.