Gannavaram High Tension : పట్టాభి తొందరపాటు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే శాంతి భద్రతలకు విఘాతం.. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా

తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో పుటేజీలు పరిశీలిస్తున్నామని, సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగిందని, చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరిత్యా చర్యలు తప్పవని ఎస్పీ జాషువాహెచ్చరించారు.

Gannavaram High Tension : పట్టాభి తొందరపాటు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే శాంతి భద్రతలకు విఘాతం.. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా

P. JOSHUA

Gannavaram High Tension : శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేత పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని ఎస్పీ అన్నారు. పట్టాభి విధులు నిర్వహిస్తున్న పోలీసులు మీద దాడికి పురిగొల్పడం, బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని ఎస్పీ తెలిపారు.

Gannavaram High Tension : గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్‌పై దాడి, కారుకి నిప్పు

తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో పుటేజీలు పరిశీలిస్తున్నామని, సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగిందని, చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరిత్యా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 సీఆర్పీసీ, 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉందని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహించరాదని ఎస్పీ అన్నారు.

Police Stopped Chandana : డీజీపీ ఇంటికి బయల్దేరిన పట్టాభి భార్య చందనను అడ్డుకున్న పోలీసులు

గన్నవరం నియోజకవర్గం పరిధిలో సోమవారం జరిగిన టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈ రోజు టీడీపీ శ్రేణులు ఛలో గన్నవరం కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం విధితమే. అయితే, ఛలో గన్నవరం కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని ఎస్పీ జాషువా అన్నారు. నిబంధనలు అతిక్రమించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, గన్నవరం పరిసర ప్రాంతాలకు ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్టు, పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీల శ్రేణులు సహకరించాలని ఎస్పీ జాషువా కోరారు.