KRMB : ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ

వెలిగొండ ప్రాజెక్టు, తెలుగు గంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌లు తక్షణమే సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది.

KRMB : ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ

Krmb

AP government : వెలిగొండ ప్రాజెక్టుతో పాటు తెలుగు గంగ ప్రాజెక్టు విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌లు తక్షణమే సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే ఏపీ ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌కి లేఖ రాశారు.

విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించిందని.. అనుమతి లేకుండా తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ ప్రాజెక్టుల పనులు ఆపేలా చూడాలని కేఆర్ఎంబీని కోరింది.

దీనిపై స్పందించిన కేఆర్‌ఎంబీ.. తెలంగాణ ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని.. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ చేసిన ఫిర్యాదు లేఖను కూడా లేఖతో పాటు జతపరిచి ఏపీకి పంపించింది.

తెలంగాణ అభ్యంతరాలతో కృష్ణా రివర్‌ బోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగా కేంద్ర ప్రభుత్వం వెలిగొండను అధికారిక ప్రాజెక్టుగా గెజిట్‌లో ప్రకటించింది. కేఆర్ఎంబీ పంపిన లేఖపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.