AP New Ministers : రాజ్ భవన్ కు జీఏడీ అధికారులు.. సీల్డ్ కవర్ లో ఏపీ కొత్త మంత్రుల జాబితా

25 మంది పేర్లతో కూడిన మంత్రుల జాబితాను ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది. సాయంత్రం 5 గంటల లోపు గవర్నర్ కొత్త మంత్రుల జాబితాకు ఆమోదముద్ర వేయబోతున్నారు.

AP New Ministers : రాజ్ భవన్ కు జీఏడీ అధికారులు.. సీల్డ్ కవర్ లో ఏపీ కొత్త మంత్రుల జాబితా

Ap Cabinet (4)

Updated On : April 10, 2022 / 2:43 PM IST

AP new ministers : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్ కొలువు తీరడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఏపీ రాజ్ భవన్ కు జీఏడీ అధికారులు చేరుకున్నారు. సీల్డ్ కవర్ లో ఏపీ కొత్త మంత్రుల జాబితా ఉంది. గవర్నర్ స్పెషల్‌ సీఎస్‌కు జీఏడీ అధికారులు సీల్డ్ కవర్ అందించనున్నారు. 25 మంది పేర్లతో కూడిన మంత్రుల జాబితాను ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది.

సాయంత్రం 5 గంటల లోపు గవర్నర్ కొత్త మంత్రుల జాబితాకు ఆమోదముద్ర వేయబోతున్నారు. మంత్రివర్గంలో కొనసాగేది ఎవరూ….కొత్తగా వచ్చేది ఎవరో.. 10 టీవీ నిన్ననే ఎక్స్‌క్లూజివ్ రిపోర్టు అందించింది. ఆ రిపోర్టును దాదాపుగా నిజం చేస్తూ జగన్ ఎలక్షన్ టీమ్ 2.0 రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు పది మంత్రి పేర్లు బయటకు వచ్చాయి.

AP Cabinet : జగన్ టీం 2.0… మంత్రుల జాబితా ఖరారు

వారిలో బొత్స, పెద్దిరెడ్డి, జయరాం, వేణుగోపాల్ పాత మంత్రులు కాగా… కొత్తగా జోగి రమేశ్, విడదల రజిని, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్ననాథ్ , కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి.మరికాసేపట్లో మిగతా పేర్లు కూడా బయకు రాబోతున్నాయి. రేపు ప్రమాణస్వీకారం చేయబోయే వారికి సీఎంవో నుంచి ఫోన్లు వెళ్తున్నాయి.