Tirumala Temple: తిరుమల ఆలయానికి 10 ఎకరాలు స్థలం కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం పది ఎకరాల స్థలం కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tirumala Temple: తిరుమల ఆలయానికి 10 ఎకరాలు స్థలం కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Aditya

Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం పది ఎకరాల స్థలం కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు స్థలం కేటాయింపు పై కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే వెల్లడించారు. బుధవారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆదిత్య థాకరే..ఈమేరకు వివరాలు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) సమీపంలో 10 ఎకరాల స్థలం ఇవ్వాలన్న ప్రతిపాదనకు తమ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆదిత్య థాకరే పేర్కొన్నారు. మహారాష్ట్రలో శ్రీవెంకటేశ్వర స్వామి వారి రాకతో రాష్ట్ర ప్రజలకు శాంతి, శ్రేయస్సు, ఆనందం మరియు భద్రత లభిస్తుందని, ఆయన పవిత్ర సన్నిధి ద్వారా మనం ఆశీర్వదించబడతామని” ఆదిత్య థాకరే అన్నారు.

Also read:Telangana Govt : 111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేత

ఏప్రిల్ 2న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మహారాష్ట్ర మంత్రులు ఆదిత్య థాకరే, ఏకనాథ్ షిండేను కలుసుకున్నారు. ఈసంధర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలపై సుబ్బారెడ్డి వారికి వివరించారు. అనంతరం నవీముంబైలోని ఉల్వే ప్రాంతంలో టీటీడీ కోసం భూమిని కేటాయిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈక్రమంలోనే 10 ఎకరాల స్థలం టీటీడీ కోసం కేటాయించగా..త్వరలో ఇక్కడ స్వామి వారి ఆలయ నిర్మాణం, భక్తుల కోసం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ టీటీడీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగుతూన్నాయి.

Also Read:TTD : పంచగవ్య ఉత్పత్తులకు ఫుల్ రెస్పాన్స్.. ఈ కామర్స్ ద్వారా విక్రయాలు