Agnipath : అగ్నిపథ్ అల్లర్లు-రైలు నిలిపివేత-రోగి మృతి Agnipath

Agnipath : అగ్నిపథ్ అల్లర్లు-రైలు నిలిపివేత-రోగి మృతి

అగ్నిపథ్ ఆందోళనల కారణంగా ఒక రోగి మృతి  చెందిన ఘటన ఈరోజు విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. 

Agnipath : అగ్నిపథ్ అల్లర్లు-రైలు నిలిపివేత-రోగి మృతి

Agnipath : అగ్నిపథ్ ఆందోళనల కారణంగా ఒక రోగి మృతి  చెందిన ఘటన ఈరోజు విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.  ఒడిషాకు చెందిన జోగేష్  బెహరా(70) అనే వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేయించుకోవటం కోసం విశాఖపట్నం వెళ్లటానికి కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరాడు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపథ్ ఆందోళనలలో భాగం ఆందోళన కారులు ఈరోజు ఉదయం విశాఖ రైల్వే స్టేషన్ ను ముట్టడిస్తారనే ముందస్తు సమాచారంతో రైల్వే స్టేషన్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్ ను కొద్దిసేపు మూసివేశారు.

దీంతో హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్త వలస జంక్షన్ లో నిలిపి వేశారు. కోర్బా ఎక్స్ ప్రెస్‌ను కూడా ఈరోజు ఉదయం విజయనగరం జిల్లా కొత్త వలస వద్ద కొద్దిసేపు నిలిపి వేశారు. ఆ సమయంలో బెహరాకు ఛాతిలో నొప్పి ఎక్కువ కావటంతో కుటుంబ సభ్యులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.

అంబులెన్స్ రావటం ఆలస్యం కావటంతో స్ధానిక రవాణా సదుపాయలతో కొత్తవలస లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా బెహరా తుది శ్వాస విడిచాడు. దీంతో కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read : Agnipath: ‘అగ్నిప‌థ్’ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారికి పోలీసు క్లియ‌రెన్స్ రాదు: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్

 

×