Agnipath: ‘అగ్నిప‌థ్’ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారికి పోలీసు క్లియ‌రెన్స్ రాదు: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్

'అగ్నిపథ్' పథకాన్ని ఉప‌సంహ‌రించుకోవాలంటూ హింసాత్మ‌క ఘ‌ట‌నల‌కు పాల్ప‌డుతోన్న ఆర్మీ ఉద్యోగార్థులు భ‌విష్య‌త్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రి హెచ్చ‌రించారు.

Agnipath: ‘అగ్నిప‌థ్’ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారికి పోలీసు క్లియ‌రెన్స్ రాదు: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్

Air Chief Marshal Vr Chowdary

Agnipath: ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉప‌సంహ‌రించుకోవాలంటూ హింసాత్మ‌క ఘ‌ట‌నల‌కు పాల్ప‌డుతోన్న ఆర్మీ ఉద్యోగార్థులు భ‌విష్య‌త్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రి హెచ్చ‌రించారు. దేశంలో ఇంతగా అల్లర్లు జ‌రుగుతాయ‌ని తాము ఊహించ‌లేద‌ని చెప్పారు. ఇటువంటి హింసాత్మ‌క ధోర‌ణిని ఖండిస్తున్నామ‌ని అన్నారు. స‌మ‌స్య‌కు ఇది ప‌రిష్కారం కాద‌ని చెప్పారు. యువ‌త ఉద్యోగాల‌కు ఎంపికైతే చివ‌రి ద‌శ‌లో పోలీస్ వేరిఫికేష‌న్ ఉంటుంద‌ని, హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల్లో పాల్గొన్న‌వారు పోలీసుల నుంచి క్లియ‌రెన్స్ పొంద‌లేర‌ని తెలిపారు.

Agnipath: రేపు జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగనున్న కాంగ్రెస్

అగ్నిప‌థ్ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్ట‌డం మంచి నిర్ణ‌య‌మ‌ని చెప్పారు. ఈ ప‌థ‌కంపై అనుమానాలు ఉన్నవారు ద‌గ్గ‌ర‌లోని మిలిట‌రీ స్టేష‌న్లు, ఎయిర్‌ఫోర్స్, నౌకాద‌ళ స్థావ‌రాల వ‌ద్దకు వెళ్లి వాటిని నివృత్తి చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు. యువ‌త‌ స‌రైన స‌మాచారం తెలుసుకుని, ప‌థ‌కంలోని ప్ర‌యోజ‌నాల‌ను అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ఈ ప‌థ‌కంపై యువ‌త త‌మ‌కు ఉన్న అనుమానాల‌న్నింటినీ నివృత్తి చేసుకుంటార‌ని తాను ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. అగ్నిప‌థ్ ద్వారా ఉద్యోగాల్లో చేరితే నాలుగేళ్ళు కొన‌సాగ‌వ‌చ్చ‌ని, దేశానికి సేవ చేసిన వారు అవుతార‌ని ఆయ‌న అన్నారు. అంతేగాక‌, క్ర‌మ‌శిక్ష‌ణ నేర్చుకుంటార‌ని చెప్పారు.