TTD : టీటీడీకి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్టు

అలిపిరి చెక్ పాయింట్ లో బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేశారు. బాంబు పేలి వంద మంది చనిపోతారని ఫేక్ కాల్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

TTD : టీటీడీకి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్టు

Fake Caller Arrest

TTD Fake Caller Arrest : తిరుమలలో టీటీడీకి బెదిరింపులతో ఫేక్ కాల్ చేసిన వ్యక్తి అరెస్టు అయ్యారు. నిందితుడు తమిళనాడు సేలంకు చెందిన బి.బాలాజీ(39)గా గుర్తించారు. ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున టీటీడీకి నిందితుడు బి.బాలాజీ బెదిరింపు కాల్ చేశాడు.

అలిపిరి చెక్ పాయింట్ లో బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేశారు. బాంబు పేలి వంద మంది చనిపోతారని ఫేక్ కాల్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నకిలీ ఫోన్ కాల్ గా గుర్తించారు.

Tirumala Nadakadari : తిరుమల నడకమార్గంలో చిరుతల బెడద.. తగ్గుతున్న కాలినడక భక్తుల సంఖ్య

దీనిపై విజిలెన్స్ ఫిర్యాదుతో పోలీసులు ఆగస్టు16న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు బాలాజీ సెల్ ఫోన్ ఆధారంగా అతన్ని తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.