Chittoor : బట్టతల దాచాడు...మ్యాట్రిమోని సైట్లలో యువతులకు ఎర, సాప్ట్ వేర్ ఇంజినీర్ చీటింగ్ | Matrimonial Fraud In Chittoor Man Cheated Womens

Chittoor : బట్టతల దాచాడు…మ్యాట్రిమోని సైట్లలో యువతులకు ఎర, సాప్ట్ వేర్ ఇంజినీర్ చీటింగ్

మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు ఎర వేశాడు. బట్టతలను దాచి...పలువురు యువతులను మోసగించి...రూ. లక్షల్లో నగదు లూటీ చేశాడు.

Chittoor : బట్టతల దాచాడు…మ్యాట్రిమోని సైట్లలో యువతులకు ఎర, సాప్ట్ వేర్ ఇంజినీర్ చీటింగ్

Matrimonial Fraud : ఉన్నత చదువులు చదివాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేశాడు. కానీ..డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో అక్రమమార్గం పట్టాడు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు ఎర వేశాడు. బట్టతలను దాచి…పలువురు యువతులను మోసగించి…రూ. లక్షల్లో నగదు లూటీ చేశాడు. అంతేగాదు…గంజాయి స్మగ్లింగ్ చేయడం, నకిలీ సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టి..ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డాడు. కానీ..అతని మోసాలు ఎంతోకాలం నిలవలేదు. చివరకు పోలీసులకు చిక్కాడు. కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ సెంథిల్ కుమార్, డీఎస్పీ సుధాకర్ రెడ్డిలు మీడియాకు తెలియచేశారు.

Read More : Red Alert : నాన్ స్టాప్ వర్షాలు, ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

ఐఐటీ కాన్పూర్ లో ఎంటెక్ :-
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్ (33)…డిగ్రీ వరకు అద్దంకిలో చదివాడు. హైదరాబాద్ కు మకాం మార్చి MCA పూర్తి చేశాడు. అనంతరం ఐఐటీ కాన్పూర్ లో ఎంటెక్ చేశాడు. ఎందుకో మధ్యలోనే చదువు మానేసి…సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశాడు. 2017 సంవత్సరంలో మ్యాట్రిమోని వెబ్ సైట్ లో తన ఫొటో ఉంచాడు. దీని ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో ఆన్ లైన్ ఛాటింగ్ చేసి…డబ్బులు సంపాదించాడు. అప్పటికే ఇతడికి బట్టతల ఉంది. కానీ..ఈ విషయాన్ని దాచిపెట్టి..విగ్గుతో ఉన్న ఫొటోలు అందులో పెట్టేవాడు. రూ. లక్షలు రావడంతో..ఇదే బెస్ట్ అని అనుకుని…పలు మ్యాట్రిమోని వెబ్ సైట్ లలో ఫొటోలు పెట్టేవాడు.

Read More :Viral Video : రెప్పపాటులో బాలుడిని రక్షించిన కార్మికుడు..వీడియో వైరల్

యువతులతో ఆన్ లైన్ ఛాటింగ్ :-
నకిలీ పేర్లు ఉంచుతూ…యువతులతో ఆన్ లైన్ ఛాటింగ్ చేసేవాడు. మాయమాటలు చెబుతూ..వారిని మగ్గులోకి దించేవాడు. వారిచేత తన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకొనేవాడు. 2017లో ఒంగోలుకు చెందిన ఓ టెకీ వద్ద రూ. 27 లక్షలు, 2018లో నరసరావుపేటకు చెందిన మరో టెకీ వద్ద రూ. 40 లక్షలు కాజేశాడు. అప్పుడే రెండుసార్లు అరెస్టయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత..కూడా..శ్రీనివాస్ లో మార్పు రాలేదు. మరోసారి అదే మార్గం ఎంచుకున్నాడు.

Read More : Telangana : ఇంటర్ విద్యా సంవత్సరం ఖరారు, పరీక్షల తేదీలు

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ :-
రెండు నెలల క్రితం చిత్తూరుకు చెందిన ఓ యువతిని మ్యాట్రిమోనీ ద్వారా మోసం చేసి రూ. 1.4 లక్షలు, మదనపల్లెలో మరో యువతిని మోసం చేసి…రూ. 7 లక్షలు కాజేశాడు. బాధిత యువతుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు..శ్రీనివాస్ కోసం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో..చిత్తూరు – బెంగళూరు సమీపంలో…నాలుగు కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ…ఇతను దొరికిపోయాడు. విచారణలో శ్రీనివాస్ చేసిన మోసాల చిట్టా బయటకు వచ్చింది. నిందితుడి నుంచి రూ. 50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చేధించడానికి ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులు అందచేశారు.

×