Viral Video : రెప్పపాటులో బాలుడిని రక్షించిన కార్మికుడు..వీడియో వైరల్

క్షణాల్లో ఓ బాలుడిని పారిశుధ్య కార్మికుడిని రక్షించాడు. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Viral Video : రెప్పపాటులో బాలుడిని రక్షించిన కార్మికుడు..వీడియో వైరల్

Sanitaion

Sanitation Worker Saved : ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని వీడియోలు చూస్తుంటే..కొందరిలో మంచితనం ఇంకా ఉంది అని అనిపిస్తుంటుంది. తమ ప్రాణాలు సైతం అడ్డు పెట్టి..ఇతరుల ప్రాణాలు కాపాడుతుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా క్షణాల్లో ఓ బాలుడిని పారిశుధ్య కార్మికుడిని రక్షించాడు. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More : Hetero : కరోనా ఔషధం ‘టోసిరా’ అత్యవసర వినియోగానికి ఆమోదం

రెక్స్ చాప్ మన్ ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. అందులో ఓ వీధిలో ఇంటి గేటు తెరిచి ఉంది. దీంతో ఇంట్లో బాలుడు ఇంటి బయటకు వచ్చాడు. రోడ్డుపై అటూ..ఇటూ చూశాడు. ఓ చెత్త ట్రాక్టర్ వచ్చింది. అది కొద్దిగా ముందుకు వెళ్లగానే..పరుగు పరుగున రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. కానీ చెత్త ట్రాక్టర్ కు అటువైపు ఉన్న రోడ్డుపై కారు వేగంగా వస్తోంది.

Read More : India vs England : చరిత్ర సృష్టించారు, భారత్ ఘన విజయం

ఈ విషయం బాలుడిక తెలియదు. కొద్ది తేడాలో కారు బాలుడిని గుద్దేసేది. దీనిని గమనించిన పారిశుధ్య కార్మికుడు..అమాంతం వాహనం నుంచి కిందకు దిగి..బాలుడిని పక్కకు లాగేశాడు. దీంతో అతడికి ఏమీ కాలేదు. ఇంటి వద్దనున్న సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు కార్మికుడిపై ప్రశంసిస్తున్నారు.