Visakha Steel Plant : బయ్యారం, విశాఖ ఉక్కులను అదానీకి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు..తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి : కేటీఆర్

జాతి ప్రాజెక్టును ప్రధాని మోదీ తన దోస్తులకు కట్టబెడుతున్నారని తాజాగా ఇటు బయ్యారం, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని..ప్రభుత్వం రంగ సంస్థలు ప్రైవేటీకరణ జరిగితే రిజర్వేషన్లు కోల్పోవాల్సివస్తుందని ఈ విషయాన్ని తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.

Visakha Steel Plant : బయ్యారం, విశాఖ ఉక్కులను అదానీకి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు..తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి : కేటీఆర్

ktr explained Modi  bayyaram, and vizag steel plant

Visakha Steel Plant : జాతి ప్రాజెక్టును ప్రధాని మోదీ తన దోస్తులకు కట్టబెడుతున్నారని తాజాగా ఇటు బయ్యారం, అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి కట్టబెట్టటానికి మోదీ కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని..ప్రభుత్వం రంగ సంస్థలు ప్రైవేటీకరణ జరిగితే రిజర్వేషన్లు కోల్పోవాల్సివస్తుందని ఈ విషయాన్ని తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. భారతదేశాన్ని అదానికి కట్టబెట్టటానికి మోదీ చేసే యత్నాలను అడ్డుకోవాల్సిన అసవరం చాలా ఉందన్నారు. అదానీకి ఇచ్చిన బైలడిల్లాని రద్దు చేయాలని ఈ సందర్బంగా కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. బైలడిల్లాలో 6 లక్షల కోట్ల రూపాయల విలువైన ఐరన్ ఓర్ ఉందని దాన్ని అదానీకి దోచిపెట్టటానికి కుట్రలు చేశారని ఆరోపించారు.దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.బైలడిల్లాను అదానీకి అప్పగించటంతో రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.

బయ్యారం ఉక్కు గురించి తాను ప్రధాని మోదీనికలిసానని కానీ బయ్యారం ఉక్కులో నాణ్యత లేదని అంటూ తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ఇటువంటి తప్పుదారి పట్టించే బీజేపీ పాలనలోనే శూన్యత ఉంది అంటూ ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కుట్ర ఉందని దాన్ని కూడా అదానీకి దారాదత్తం చేయటానికి మోదీ యత్నిస్తున్నారని అన్నారు.

మోదీ పాలనలో ఇటువంటి కుట్రలు అదానీ కోసం చాలానే చేస్తున్నారని అదానీ విషయం తీసేసరికి వారి బండారం ఎక్కడ బయటపడుతుందనోనని బీజేపీ నేతలు మాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. దాంట్లో భాగంగానే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపింటంలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అడుగుతున్న ప్రశ్నలకు ఈ సందర్బంగా కేటీఆర్ సమాధానమిస్తూ..బండికి విషయం పరిరిజ్ఞానం లేదు. విషయం తెలియదు. ఆయనకు చెబితే ఒక బాధ.. చెప్పకపోతే ఒక బాధ అంటూ సెటైర్లు వేశారు.

విశాఖ ఉక్కుకు, బయ్యారం ఉక్కుకు తేడా ఉందన్నారు. 134 కోట్ల మెట్రిక్ ట్నుల ఐరన్ ఓర్ బైలదిల్లాలో ఉంది. బైలదిల్లా అనేది ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒడిశా దాకా వ్యాపించిన ఐరన్‌ ఓర్ గని. ఇది చాలా పెద్ద గని. 134 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ ఉన్న గని బైలదిల్లా..భౌగోళికంగా చూస్తే ఇది బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైజాగ్‌ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. బయ్యారంలో తక్కువ క్వాలిటీ ఫెర్రస్ ఉందని మోదీ తప్పుదారి పట్టిస్తున్నారని..కానీ బైలడిల్లా నుంచి ఫెర్రస్ పైప్ లైన్ వేయాలని ప్రధానికి కోరానని ఈ సందర్బంగా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ బయ్యారంలో క్వాలిటీ లేనిదంటూ తప్పుదారి పట్టించారనే కుట్రను అర్థం చేసుకోలేకపోయామని అలా అది అదానీ చేతిలో పెట్టేశారని వివరించారు కేటీఆర్. అలా బైలడిల్లాను ప్రైవేట్ కంపెనీగా మార్చేశారని ఇదంతా ప్రధాని మోదీ అదానీ కోసం చేసిన కుట్రలని అదే కుట్రలను బయ్యారం,విశాఖ ఉక్కులను కూడా అదానీకి కట్టబెట్టటానికి కుట్ర చేస్తున్నారంటూ విమర్శించారు.

బయ్యారం నుంచి బైలదిల్లా 150-160కిలోమీటర్లు. బైలదిల్లా నుంచి వైజాగ్‌ 600 కిలోమీటర్లు. అదే ముంద్రాకు 1800 కిలోమీటర్లు. ఇక్కడ ఫీజబుల్‌ కాదు.. కానీ తవ్వి 1800 కిలోమీటర్లు తీసుకెళ్తే ఫీజబుల్‌ ఎలా అవుతుందని అని ప్రశ్నించారు. ఇటువంటి కుట్రలను తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ తన దోస్తు అదానీ కోసం వైజాగ్‌ పొట్టకొడుతున్నారన్నారు. బయ్యారం ఎండబెట్టేది కూడా ప్రధాని మోదీ..ఆయనగారి దోస్తు ఆదానీయేనన్నారు. ఇలా ప్రధాని, ఆదానీ కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజల పొట్టుకొడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు.