bjp: అమరావతి కోసం మోదీ రూ.2,500 కోట్లు కేటాయించారు: సోము వీర్రాజు

 కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌ను ఏపీ స‌ర్కారు దారి మ‌ళ్ళిస్తోంద‌ని, ఏపీలో రైతుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అలాగే, రాజధాని అమరావతి కోసం ప్రధాని మోదీ రూ.2,500 కోట్లు కేటాయించారని ఆయ‌న చెప్పారు. గుంటూరు జిల్లా పెనుమాకలో త‌మ పార్టీ నిర్వ‌హించిన ఓ స‌భ‌లో పాల్గొన్న సోము వీర్రాజు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... ఏపీలో రాజధాని కడతానని జ‌గ‌న్ ఎన్నికల ముందు చెప్పార‌ని, అధికారంలోకి వ‌చ్చాక‌ మాట మార్చార‌ని అన్నారు.

bjp: అమరావతి కోసం మోదీ రూ.2,500 కోట్లు కేటాయించారు: సోము వీర్రాజు

Somu Veerraju

bjp: కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌ను ఏపీ స‌ర్కారు దారి మ‌ళ్ళిస్తోంద‌ని, ఏపీలో రైతుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అలాగే, రాజధాని అమరావతి కోసం ప్రధాని మోదీ రూ.2,500 కోట్లు కేటాయించారని ఆయ‌న చెప్పారు. గుంటూరు జిల్లా పెనుమాకలో త‌మ పార్టీ నిర్వ‌హించిన ఓ స‌భ‌లో పాల్గొన్న సోము వీర్రాజు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… ఏపీలో రాజధాని కడతానని జ‌గ‌న్ ఎన్నికల ముందు చెప్పార‌ని, అధికారంలోకి వ‌చ్చాక‌ మాట మార్చార‌ని అన్నారు.

ఏపీలో మూడు రాజధానులు ఉండాల‌ని జ‌గ‌న్ అన్నార‌ని గుర్తుచేశారు. ఏపీకి మోదీ ఏం చేశారని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నార‌ని, విజయవాడలో ఐదు ఫ్లై ఓవర్లు కట్టించారని ఆయ‌న చెప్పారు. అలాగే, అమరావతి-మచిలీపట్నం మధ్య 4 వరుసల రహదారి వేశామ‌ని ఆయ‌న తెలిపారు. పంచాయతీలకు కేంద్ర ప్ర‌భుత్వం కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రిగ్గా వాడ‌డం లేద‌ని సోము వీర్రాజు అన్నారు.

టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులో ఉంటే ఏపీ రాజధాని నిర్మాణం ఇప్ప‌టికే జ‌రిగేద‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో వైసీపీని ఓడించి బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని, ఇది జరిగితేనే రెండేళ్ళ‌లో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఆయ‌న తెలిపారు.

borewell: బోరుబావిలో ప‌డి 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన బాలిక.. 5 గంటల్లో బ‌య‌ట‌కు తీసిన జ‌వాన్లు