Young Man Suicide : పోలీస్ స్టేషన్ ఎదుట తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం.. కొడుకు మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ఎదుట తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో కొడుకు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

Young Man Suicide : నంద్యాల జిల్లా బనగానపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ఎదుట తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో కొడుకు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన యువకుడు దస్తగిరి మృతదేహంతో కుబుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఎస్ఐ అసభ్యంగా తిట్టడం వల్లే దస్తగిరి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బీసీ. జనార్ధన్ రెడ్డి వారితో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుటు ధర్నా చేశారు. దస్తగిరి ఆత్మహత్యకు కారణమైన ఎస్ ఐ శంకర్ నాయక్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఓ నగదు పంచాయతీ కోసం ఎస్ ఐని కొడుకు దస్తగిరి, ఆమె తల్లి గురువమ్మ సంప్రదించినప్పుడు ఎస్ఐ అసభ్యంగా మాట్లాడారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.