Lockup Death Rayadurgam PS : రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్.. ఫ్యాన్ కు ఉరివేసుకుని వ్యక్తి అనుమానాస్పద మృతి

అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ నమోదు అయింది. ఓ వ్యక్తి లాకప్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందారు.

Lockup Death Rayadurgam PS : రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్.. ఫ్యాన్ కు ఉరివేసుకుని వ్యక్తి అనుమానాస్పద మృతి

Lockup death

Lockup Death Rayadurgam PS : అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కలకం రేపింది. ఓ వ్యక్తి లాకప్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందారు. దీంతో సీఐతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపుం జిల్లా రాయదుర్గం మండలం పైపల్లి గ్రామంలో నిన్న గొర్రెల దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు.

వీరిలో రామాంజనేయులు అలియాస్ ఆంజనేయులు ఉన్నారు. వీరిద్దరిని ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆంజనేయులు లాకప్ లో అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందారు. ఆంజనేయులు మ‌ృతదేహాన్ని స్థానిక కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు ఆంజనేయులుది ఆత్మకూరు మండలం శరభ గ్రామంగా గుర్తించారు.

Lockup Death In UP : ఉత్తరప్రదేశ్ లో లాకప్ డెత్.. 9 మంది పోలీసులపై హత్య కేసు నమోదు

విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐ శ్రీనివాసులుతోపాటు కానిస్టేబుళ్లు గంగన్న, రమేష్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఫకీరప్ప పరిశీలించారు. ఆంజనేయులు ఉరివేసుకున్న సమయంలో డ్యూటీల్లో ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఆరా తీశారు. ఆంజనేయులు రాత్రి పోలీస్ స్టేషన్ లో తన పంచతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారని డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు.

అది చూసిన పక్కన వ్యక్తి పోలీసులకు చెప్పాడని తెలిపారు. వెంటనే ఆంజనేయులును కిందకు దించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, అప్పటికే అతను మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ఆంజనేయులుపై 15 గొర్రెల దొంగతనం కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన లో కూడా అనుమానిత జాబితాలో ఆంజనేయులు పేరు ఉందని వెల్లడించారు.