Lockup Death In UP : ఉత్తరప్రదేశ్ లో లాకప్ డెత్.. 9 మంది పోలీసులపై హత్య కేసు నమోదు

ఉత్తరప్రదేశ్ లో పోలీస్ కస్టడీలో చిత్రహింసలు భరించలేక ఓ వ్యక్తి మృతి చెందారు. దీనిపై నిరసనలు వ్యక్తమవ్వడంతో తొమ్మిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు అయింది. ఈ విషయంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడినట్లు బీజేపీ ఎంపీ దేవేంద్ర సింగ్ పేర్కొన్నారు.

Lockup Death In UP : ఉత్తరప్రదేశ్ లో లాకప్ డెత్.. 9 మంది పోలీసులపై హత్య కేసు నమోదు

Lockup death

Lockup Death In UP : ఉత్తరప్రదేశ్ లో పోలీస్ కస్టడీలో చిత్రహింసలు భరించలేక ఓ వ్యక్తి మృతి చెందారు. దీనిపై నిరసనలు వ్యక్తమవ్వడంతో తొమ్మిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు అయింది. కాన్పూర్ లో బల్వంత్ సింగ్ అనే ఆభరణాల వ్యాపారిపై మరో నగల వ్యాపారి దొంగతనం ఆరోపణలు చేశారు. దీంతో ఈ నెల 12న పోలీసులు అతన్ని రానియా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. బల్వంత్ సింగ్ ను పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో అతను కస్టడీలోనే మరణించారు.

అయితే గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని వారికి అప్పగించారు. అయితే బల్వంత్ సింగ్ మృతదేహంపై 22 చోట్ల గాయాలున్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు. కస్టడీలో పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపారని ఆరోపించారు. బల్వంత్ సింగ్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనకు దిగారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమంటూ నినాదాలు చేశారు.

lockup Death : మరో లాకప్ డెత్ ఘటన-10 రోజుల్లో రెండో కేసు

ఈ ఘటనపై బీజేపీ ఎంపీ దేవేంద్ర సింగ్ భోటే జోక్యం చేసుకున్నారు. దీంతో డాక్టర్ల కమిటీతో బల్వంత్ సింగ్ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం 9 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. హత్యా నేరంతోపాటు పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు.

ఈ విషయంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడినట్లు బీజేపీ ఎంపీ దేవేంద్ర సింగ్ పేర్కొన్నారు.
పోలీస్ కస్టడీ డెత్ ను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం, భూమి, ఇల్లు, పిల్లలకు ఉచితంగా విద్య, వృద్ధురాలైన తల్లికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.