lockup Death : మరో లాకప్ డెత్ ఘటన-10 రోజుల్లో రెండో కేసు

తమిళనాడులో మరో లాకప్ డెత్ ఘటన చోటు చేసుకుంది. పది రోజుల వ్యవధిలో ఇది రెండో కేసు. తిరువణ్ణామలై జిల్లాలోని తత్తరణై కి చెందిన తంగమణి అనే వ్యక్తిని కల్తీ మద్యం విక్రయాలపై పోలీసులు విచారణ నిమిత్తం ఏప్రిల్ 26న అదుపులోకి తీసుకున్నారు.

lockup Death : మరో లాకప్ డెత్ ఘటన-10 రోజుల్లో రెండో కేసు

Tamilnadu Lockup Death

Lockup Death :  తమిళనాడులో మరో లాకప్ డెత్ ఘటన చోటు చేసుకుంది. పది రోజుల వ్యవధిలో ఇది రెండో కేసు. తిరువణ్ణామలై జిల్లాలోని తత్తరణై కి చెందిన తంగమణి అనే వ్యక్తిని కల్తీ మద్యం విక్రయాలపై పోలీసులు విచారణ నిమిత్తం ఏప్రిల్ 26న అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 27 వతేదీన తంగమణి మరణించినట్లు గా పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల చిత్ర హింసల వల్లే తంగమణి మరణించాడని కుటుంబ సభ్యులు, బంధువులు తిరువణ్ణామలై-కళ్ళకురిచ్చి రహదారిపై ధర్నాకు దిగారు.

కాగా… బుధవారం తంగమణి ని అదుపులోకి తీసుకుని తిరువణ్ణామలై సబ్ జైలుకు తరలించామని… అక్కడ అతనికి ఫిట్స్ రావటంతో ఆస్పత్రిలో చేర్పించగా… చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అంతకు ముందు ఏప్రిల్ 21 న పోలీసు ఇన్స్ పెక్టర్ నిర్మల, ఎస్బీ సీఐడీ అధికారి పళని స్వామి మాఇంటికి వచ్చి మానాన్నపై నకిలీ మద్యం కేసు బుక్ చేస్తామని బెదిరించారని, కేసు లేకుండా ఉండేందుకు పోలీసులు మా నాన్నను రెండు లక్షలు డిమాండ్ చేశారని.. ఇవ్వకపోవటంతో అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురిచేశారని మృతుడి కుమారుడు ఆరోపించాడు.

మృతుడిపై 2009 నుండి అనేక సార్లు కల్తీ మద్యం విక్రయాలపై కేసులు ఉన్నాయని, కొన్నికేసులలో దోషిగా కూడా తేలాడని వేలూరు డీఐజీ డాక్టర్ అన్నీ విజయ్ తెలిపారు. కేసులు సీబీఐ కి అప్పగించాలని ప్రతిపత్రక్ష నేత ఎడుప్పాడి పళనిస్వామి డిమాండ్ చేశారు. చెన్నైలో 25 ఏళ్ళ గణేష్ అనే యువకుడు లాకప్ లో మరణించిన 10 రోజుల లోపే ఈ ఘటన జరగటంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు ఎక్కువయ్యాయి.
Also Read : Dowry Harassment : అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఎస్సై