Tiktok Bhargav : టిక్‌టాక్ భార్గవ్ రేప్ కేసు.. నిన్న నిత్య, నేడు మౌనిక.. లైవ్‌లో మరో యువతి ఆవేదన

టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ భార్గవ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 14ఏళ్ల బాలికను నమ్మించి గర్భవతిని చేసిన ఈ కామాంధుడి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బాలికపై అత్యాచారం కేసులో విశాఖ పోలీసులు భార్గవ్ చిప్పాడను మంగళవారం(ఏప్రిల్ 20,2021) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలిక తల్లి ఫిర్యాదుతో ఏప్రిల్ 16న పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ‘దిశ’, పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదైంది. బాలిక బట్టలు మార్చుకునే టైంలో ఫొటోలు, వీడియోలు తీసిన భార్గవ్ వాటితో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగికంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు.

Tiktok Bhargav : టిక్‌టాక్ భార్గవ్ రేప్ కేసు.. నిన్న నిత్య, నేడు మౌనిక.. లైవ్‌లో మరో యువతి ఆవేదన

Tiktok Bhargav

Tiktok Bhargav : టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ భార్గవ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 14ఏళ్ల బాలికను నమ్మించి గర్భవతిని చేసిన ఈ కామాంధుడి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బాలికపై అత్యాచారం కేసులో విశాఖ పోలీసులు భార్గవ్ చిప్పాడను మంగళవారం(ఏప్రిల్ 20,2021) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలిక తల్లి ఫిర్యాదుతో ఏప్రిల్ 16న పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ‘దిశ’, పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదైంది. బాలిక బట్టలు మార్చుకునే టైంలో ఫొటోలు, వీడియోలు తీసిన భార్గవ్ వాటితో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగికంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు.

కాగా, భార్గవ్ బాధితుల్లో చాలామందే అమ్మాయిలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. గతంలో కూడా చాలామంది యువతులను ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకపోతే ఏ ఒక్క అమ్మాయి నేరుగా అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో భార్గవ్ బండారం బట్టబయలైంది. కాగా, పలు యూట్యూబ్ ఛానల్స్ గతంలో భార్గవ్ తో కలిసి వీడియోలు చేసిన కొందరు అమ్మాయిల పేర్లు ఇప్పుడు బయటకు తీస్తున్నాయి. ఇప్పటికే OMG నిత్య పేరు తెరపైకి రాగా.. తనకూ ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, భార్గవ్‌తో మాట్లాడి ఏడాదిపైనే అయిందని క్లారిటీ ఇచ్చింది నిత్య. భార్గవ్ చేతిలో బలైన బాధితురాలిని నేనే అంటూ కొందరు తెలియక తన పేరుని, ఫొటోలను వాడుతున్నారని, వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తన తల్లితో కలిసి ఓ వీడియో రిలీజ్ చేసింది నిత్య.

 

View this post on Instagram

 

A post shared by Nithyasri (@omggirlnitya)

ఈ క్రమంలోనే గతంలో భార్గవ్‌తో వీడియోలు చేసిన యువతులు ఒక్కొక్కరుగా లైవ్ లోకి వచ్చి తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తమ పేర్లు వాడకూడదని చెబుతున్నారు. తాజాగా భార్గవ్‌తో గతంలో అమ్మాయి – అబ్బాయి పేరిట వీడియోలు చేసిన మౌనిక అనే అమ్మాయి తెరపైకి వచ్చింది. ఓ వీడియో ద్వారా స్పందించింది. ఈ కేసుతో సంబంధం లేదని తేల్చి చెప్పింది.

 

View this post on Instagram

 

A post shared by Nithyasri (@omggirlnitya)

”అమ్మాయి – అబ్బాయి ఆపేసి రెండున్నరేళ్లు అయ్యింది. అప్పటి నుంచి భార్గవ్‌తో ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. కానీ అప్పటి వీడియోల్లోంచి ఫొటోలు వాడుతూ ఇప్పుడు జరుగుతున్న కేసులో వాడుతున్నారు. నాకు, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికైనా అవన్నీ డిలీట్ చేసి ఇకపై అలాంటివి చేయొద్దని కోరుకుంటున్నా. నేను చాలా సేఫ్‌గా ఉన్నా. ప్రస్తుతం పలు షూట్స్‌తో బిజీగా ఉన్నాను” అని మౌనిక తెలిపింది.

టీవీ ఛానళ్లలో అవకాశాల పేరుతో ఓ బాలికను భార్గవ్‌ మోసం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఏప్రిల్ 16న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు.. విచారణ చేపట్టి హైదరాబాద్‌లో భార్గవ్‌ను అరెస్ట్‌ చేశారు. అతడిపై పోక్సో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా మే 3వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. భార్గవ్‌ చిప్పాడ విజయనగరం జిల్లా వాసి అని దిశ ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ తెలిపారు. కాగా, ఈ కేసులో బాధితురాలి వివరాలను(ఫొటో, పేరుని) బయట పెడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. అంతేకాదు, ఇంకా ఎవరైనా భార్గవ్ బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.