AP Floods: శభాష్ తారక్.. వరద బాధితులకు సినీ హీరోల సాయం!

ఏపీలో తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఈ వరద..

AP Floods: శభాష్ తారక్.. వరద బాధితులకు సినీ హీరోల సాయం!

Ap Floods

AP Floods: ఏపీలో తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఈ వరద కష్టాలు వీడలేదు. ఇక.. పలు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే వరదలో మునిగిపోగా.. భారీగా పంటలు, పాడి పరిశ్రమ దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా వందల ఎకరాల పంటనష్టంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆస్తుల నష్టం కలిగింది. దీంతో వరద బాధితులకు టాలీవుడ్ హీరోలు ఇవాళ వరుసగా సాయం ప్రకటించారు.

83 Film: సమ్ థింగ్ స్పెషల్ ’83’.. ఫస్ట్ వరల్డ్ కప్ నాటి ఉత్కంఠ!

ముందుగా జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ వరద విపత్తు బాధితుల సహాయానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి, వారు కోలుకోవడానికి ఒక చిన్న సాయంగా నేను 25 లక్షల రూపాయలను అందిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. బాధితులు వరద ముప్పు నుంచి త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించాడు.

Dipali Sharma: తెలుగు తెరకు మరో కొత్త అందం.. ఫోటోలు!

అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఏపి వరద బాధితుల సహాయార్ధం 25 లక్షల రూపాయలు సాయంగా ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్‌లో వినాశకరమైన వరదల దృష్ట్యా, నేను సిఎంఆర్ఎఫ్ కి 25 లక్షలు అందించాలనుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నానని మహేష్ ట్వీట్ చేశాడు.

Lakshya: తప్పించి గెలవాలా? తప్పుడు దారిలో గెలవాలా?

ఆ తర్వాత, మెగాస్టార్ చిరంజీవి సైతం వరద బాధితుల సహాయార్ధం 25 లక్షల రూపాయలు ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్‌లో వరదలు & కుండపోత వర్షాల కారణంగా విస్తృతంగా వ్యాపించిన విధ్వంసంతో బాధపడ్డాను. సహాయ కార్యక్రమాలకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలను వినయపూర్వకంగా అందిస్తానని చిరంజీవి ట్వీట్ చేశాడు.

Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్స్.. ఒకేసారి 3 సినిమాలకు ఒప్పందం!

గతంలోనూ వరదలతో పాటు జాతీయ విపత్తులు తలెత్తినప్పుడు పలువురు టాలీవుడ్ ప్రముఖులు బాధితులకు సాయం అందించింది. కానీ ఈసారి మాత్రం ఇంకా స్పందించడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ముందుకురవడం శుభపరిణామం. వీరి దారిలో మరికొందరు కూడా ముందుకొచ్చి విరాళాలు అందించే ఉన్నట్లుగా కనిపిస్తుంది.