Delhi : టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి ముందు చంద్రబాబును కలిసిన ఎంపీ రఘురామ కృష్ణరాజు ..! TDP ఎంపీలు రాజీనామా చేస్తారా..?!

టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి ముందు చంద్రబాబును కలిసారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.

Delhi : టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి ముందు చంద్రబాబును కలిసిన ఎంపీ రఘురామ కృష్ణరాజు ..! TDP ఎంపీలు రాజీనామా చేస్తారా..?!

MP Raghurama Krishnaraju meet Chandrababu

Delhi :  టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. విభజన హామీల కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధపడుతున్నట్లుగా సమావేశం. దీనికి సంబంధించి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో ఈ సమావేశానికి ముందు ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా చంద్రబాబుతో రఘురామ తెలిపారు. వీరి భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ తరువాత రఘురామ మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని మరి టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేలా ఒప్పించేందుకు చంద్రబాబుని కలిసానని తెలిపారు.

ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీకి ఇవ్వాల్సిన విభజనహామీలతో పాటు ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల విషయంలో చంద్రబాబు ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో ఎంపీలు ఏ విధంగా వ్యవహరించాలి? ఏఏ అంశాలపై మాట్లాడాలి?ఎంపీలుగా ఉన్న మీరు రాష్ట్రానాకి న్యాయం జరిగేలా ఎలా వ్యవహరించాలి? అనే పలు కీలక అంశాలపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా ఏపీ కోసం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎలా వ్యవహరించిందో ఎన్డీయే ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న టీడీపీపై ఎలా ఒత్తడి తెచ్చిందో అదే వ్యూహాన్ని టీడీపీ కూడా అనుసరిస్తుందా? అనే వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశం ఉద్ధేశం కూడా అదేలా కనిపిస్తోంది. ఈక్రమంలో తాను కూడా రాజీనామా చేయటానికి సిద్ధంగానే ఉన్నానంటూ చంద్రబాబుని కలిసి వైసీపీ ఎంపీ రఘురామ చెప్పటం..టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించేలా ఒప్పంచటానికి వచ్చానని చెప్పటం ఆసక్తికరంగా మారింది.కాగా కొంతకాలంలో సొంతపార్టీపైనే ఎంపీ రఘురామ తీవ్ర విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే.