Pawan Kalyan: పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు సర్వం సిద్ధం.. సెప్టెంబర్‌లోనే వారాహి మరో యాత్ర

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు జనసేన సిద్ధమైంది. పలు కార్యక్రమాలతో జనసేన జనాలకు మరింత చేరువయ్యేందుకు జనసేన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు సర్వం సిద్ధం.. సెప్టెంబర్‌లోనే వారాహి మరో యాత్ర

pawan kalyan birthday Varahi yatra

Pawan Kalyan Birthday : సెప్టెంబర్ 2 జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. పవన్ పుట్టిన రోజుకు అటు ఆయన అభిమానులే కాకు జనసేన పార్టీ (Janasena Party) నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకోవటానికి సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని జనసేన (Janasena) పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా మంగళగిరి (Mangalagiri) జనసేన పార్టీ ఆఫీసులో బ్లెడ్ క్యాంపు నిర్వహిస్తున్నామని.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులతో సహా బంతి బోజనాలు ఏర్పాటు చేశామని నాదెండ్ల తెలిపారు.

అలాగే రెల్లి కాలనీలో సందరసన ఉంటుందని.. అక్కడే పవన్ జన్మదిన కార్యక్రమాలు జరుగుతాయి తెలిపారు.బడుగు బలహీనర్గాల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు ,పెనులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అధికార పార్టీ నుండి లబ్ది పొందని దివ్యంగులకు జనసేన అండగా నిలబడుతోందని వారిని ప్రోత్సహిస్తూ చేయూతనందిస్తామన్నారు. పవన్ అభిమానుల అందరూ మెగా రక్త దానం శిబిరంలో సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

Ayyannapatrudu Arrested : విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్

వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election)ను జనసేన పార్టీ స్వాగిస్తుందని తెలిపారు నాదెండ్ల. బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను ఈ విషయంగా సంప్రదించారని..అనవసరమైన ఖర్చులు తగ్గించడం ఒక మంచి పరిణామం అని అన్నారు. అలాగే పవన్ నాలుగో విడత వారాహి యాత్ర ఎప్పుడా అని ఎదురు చూస్తున్నవారి కోసం నాదెండ్ లో శుభవార్త చెప్పారు. సెప్టెంబర్ లో మరో విడత వారాహి యాత్ర (varahi vijaya yatra) ఉంటుందని తెలిపారు. ఎన్నికల ఎప్పుడు వచ్చినా జన సేన సిద్దంగా ఉందన్నారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన కృషి చేస్తోందని అదే జనసేన లక్ష్యమన్నారు. వైసీపీని ఓడించటం.. ప్రజలకు సంక్షేమాన్ని.. అభివృద్ధిని అందించటమే జనసేన లక్ష్యమన్నారు. పొత్తులు విషయంలో జనసేన అధ్యక్షులు పవన్ చాలా స్పష్టత ఉందని నాదెండ్ల మరోసారి స్పష్టం చేశారు.