పోటీకి సై : నారా లోకేష్ నామినేషన్ ఆమోదం

10TV Telugu News

మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ నామినేషన్‌ ను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) నామినేషన్ల పరిశీలన సందర్భంగా లోకేశ్‌ అఫడవిట్ లో తప్పులు ఉన్నట్టు వైకాపా ప్రతినిధులు రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయన నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే లోకేశ్‌ తరఫు న్యాయవాదులు రిటర్నింగ్ అధికారిని ఒక్క రోజుపాటు సమయం కోరడంతో ఆయన నామపత్ర పరిశీలన బుధవారానికి వాయిదా పడింది. అయితే లోకేశ్ తరపు లాయర్లు సంబంధిత పత్రాలను ఈరోజే సమర్పించడంతో నామపత్రాన్ని అధికారులు ఆమోదించారు.తొలిసారిగా సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.