Calendars and Diaries: ఆన్‌లైన్‌లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. VIPబ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతీ సంవత్సరం అందించే క్యాలెండర్లు, డైరీలను 2022వ సంవత్సరానికి సంబంధించి అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది టీటీడీ బోర్డు.

Calendars and Diaries: ఆన్‌లైన్‌లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. VIPబ్రేక్ దర్శనాలు రద్దు

Ttd Increased Sarva Darshanam Tickets

Calendars and Diaries: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతీ సంవత్సరం అందించే క్యాలెండర్లు, డైరీలను 2022వ సంవత్సరానికి సంబంధించి అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది టీటీడీ బోర్డు. క్యాలెండర్లు కావాల్సిన భక్తులు దేవస్థానం వెబ్‌సైట్‌లోని పబ్లికేషన్స్‌ నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. పోస్టల్‌ ఛార్జీలు చెల్లించి కావాల్సినన్ని డైరీలు, క్యాలెండర్లను అడ్రెస్‌కు తెప్పించుకోవచ్చు.

భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా వీటిని పొందే అవకాశాన్ని తితిదే అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది టీటీడీ. పెద్ద డైరీ రూ.150 కాగా.. చిన్న డైరీ రూ.120కు లభిస్తుంది. క్యాలెండర్‌ రూ.130గా ఉంది. టేబుల్‌ క్యాలెండర్‌ రూ.75తో పాటు పోస్టల్‌ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

నవంబరు 13, 14, 15వ తేదీల్లో VIPబ్రేక్ దర్శనాలు రద్దు:
తిరుప‌తి న‌గ‌రంలో నవంబరు 14వ తేదీన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉండగా.. నవంబరు 13, 14, 15 తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

సిఫార్సు లేఖలు స్వీకరించబడవు:
నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబడవని టీటీడీ వెల్లడించింది. నవంబరు 13, 14, 15తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయించమని స్పష్టం చేసింది టీటీడీ.