AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కొత్త జిల్లాల వివరాలను మంత్రులకు ఆన్ లైన్ లో పంపింది ప్రభుత్వం. ఆన్ లైన్ లో సమావేశమైన మంత్రివర్గం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా 13 జిల్లాలు ఆవిర్భవించనున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి ప్రణాళిక కార్యదర్శి విజయ కుమార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక అందించారు. కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వం త్వరలోనే కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడా సంఖ్య 26కి పెరగనుంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీసీఎల్ఏ ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించింది. కొత్త జిల్లాలపై అభిప్రాయాలు స్వీకరించాలని కలెక్టర్లకు సూచించారు సీఎస్.
కేబినెట్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికన 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక్కో జిల్లాగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని పనులు ముగిశాయని, సరిహద్దులు అన్నింటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడ భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు- చేర్పులు ఉంటాయని సమాచారం. ఇక, అధికారికంగా నోటిఫికేష్ ఇవ్వడం మాత్రమే మిగిలి ఉంది.
పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ఇంతకు ముందే వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
- Bendapudi High School Students : ఇంగ్లీష్‌లో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల పిల్లలు.. సీఎం జగన్ ఫిదా
- Chandrababu On Early Elections : వ్యతిరేకత పెరిగింది, ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్-చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- YSRCP Rajya Sabha Candidates : రాజ్యసభకు వైసీపీ అభ్యర్థులు ఖరారు.. అభ్యర్థుల ఎంపికలో జగన్ స్ట్రాటజీ ఇదే
- Somu Veerraju On Alliance : బీజేపీ-జనసేన పొత్తు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
- Anil Slams Chandrababu Pawan : చంద్రబాబు, పవన్ ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం-అనిల్ కుమార్ యాదవ్
1NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
2NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
3Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
4CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
5RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
6IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
7Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
8IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
9Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
10Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్