AP Night Curfew : నేటి నుంచే కర్ఫ్యూ.. ఆంక్షలు ఇవే, వీరికి మినహాయింపు

ఈ నెల 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తారు. కాగా, కర్ఫ్యూ నుంచి పలువురికి మినహాయింపు ఇచ్చారు.

AP Night Curfew : నేటి నుంచే కర్ఫ్యూ.. ఆంక్షలు ఇవే, వీరికి మినహాయింపు

Ap Night Curfew

AP Night Curfew : కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. నేటి(జనవరి 18) నుంచి కర్ఫ్యూ అమలవుతుంది. ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తారు. నేటి నుంచి కొత్త నిబంధనలు, ఆంక్షలు అమల్లోకి వస్తాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అలాగే కర్ఫ్యూ నుంచి పలువురికి మినహాయింపు ఇచ్చారు.

ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్ లు, ఫార్మసీ, మీడియా, టెలీ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య రంగానికి చెందిన ఉద్యోగులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరంతా కూడా తమ ఐడీ కార్డు చూపించాలి. ఇక ప్రయాణాలు చేసే వారు సంబంధిత టికెట్లు చూపించాలి.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు వాడాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

* రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ
* అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు
* మాస్కులు ధరించడం తప్పనిసరి
* మాస్కు ధరించని వారికి వంద రూపాయలు జరిమానా
* సినిమా హాళ్లలో 50శాతం సీటింగ్
* సినిమా హాల్స్ లో సీటు వదిలి సీటు విధానాన్ని పాటించాలి, ప్రేక్షకులు మాస్కు ధరించాలి

* వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల విషయంలో బహిరంగ ప్రదేశాల్లో అయితే 250 మందికి మించకూడదు
* ఇండోర్ లో 100 మందికి మాత్రమే అనుమతి
* కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి
* ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు ప్రయాణికులూ మాస్కులు ధరించాలి

* వ్యాపార వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి
* దీన్ని అతిక్రమించిన వారికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా
* మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
* లేదంటే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజుల పాటు షాపులు, మార్కెట్లు మూసి వేసేలా చర్యలు
* మార్కెట్ అసోసియేషన్లు, యాజమాన్యాలు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి
* దేవాలయాలు, ప్రార్థన మందిరాలు మతపరమైన ప్రదేశాల్లో నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి

Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి

* ఆస్పత్రులు, మెడికల్ ల్యాబ్ లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సర్వీసులు, ఐటీ సంబంధ సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్య సిబ్బందికి మినహాయింపు కర్ఫ్యూ నుంచి మినహాయింపు