ఇకపై స్కూళ్లలో చేరాలంటే TC అక్కర్లేదు..

  • Published By: sreehari ,Published On : November 5, 2020 / 08:15 AM IST
ఇకపై స్కూళ్లలో చేరాలంటే TC అక్కర్లేదు..

No need TC to join in govt school : ఇకపై స్కూళ్లలో చేరాలంటే టీసీ అక్కర్లేదు.. రాష్ట్రంలోని పాఠశాలల్లో ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ లేకుండానే అడ్మిషన్ పొందొచ్చు. 5వ తరగతి లోపు ఇప్పటివరకు టీసీ లేకున్నా ప్రవేశాలకు అవకాశం ఉండేది. ఇప్పటినుంచి 10వ తరగతి వరకు టీసీ లేకున్నా అడ్మిషన్ పొందొచ్చు.. ఈ దిశగా రాష్ట్ర విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.



ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ మెలిక పెడుతున్నాయి. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలంటే ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు సిద్ధమైనా టీసీ ఇవ్వాలంటే పాత ఫీజులు
చెల్లించాల్సిందే.
https://10tv.in/teachers-students-tested-corona-positive-in-ap-government-schools/
అందుకే విద్యాశాఖ.. టీసీ అవసరం లేకుండానే పాఠశాలల్లో అడ్మిషన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి పంపింది. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్టు సమాచారం.



ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో టీసీ లేకున్నా అడ్మిషన్లు అందిస్తున్నాయి. ఉన్నత పాఠశాలల్లో మాత్రం టీసీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రైవేటు స్కూళ్లలో అన్ని క్లాసులకు టీసీ అడుగుతున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి సర్కారు డిజిటల్‌ పాఠాలు ప్రారంభించింది.



కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి వందశాతం ట్యూషన్‌ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పిస్తున్నారు.



టీసీలు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలను కోరుతున్నారు. ఫీజులు మొత్తం చెల్లిస్తేనే టీసీలు జారీ చేస్తామంటూ మెలిక పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించే వెసులుబాటుతో ఎంతో ఊరట లభించనుంది.