NTR Health University : వైద్యవిద్యలో కొత్తకోర్సులు ప్రవేశపెట్టనున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒక మాస్టర్‌ డిగ్రీతో పాటు మూడు డిగ్రీ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టనుంది.

NTR Health University : వైద్యవిద్యలో కొత్తకోర్సులు ప్రవేశపెట్టనున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ

Ntr Health University

NTR Health University new courses : డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒక మాస్టర్‌ డిగ్రీతో పాటు మూడు డిగ్రీ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టనుంది. పబ్లిక్‌ హెల్త్‌లో రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ రెండేళ్ల డిగ్రీ, క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ ఏడాది, రెండేళ్ల డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త కోర్సుల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారికి ప్రవేశం కల్పించనున్నారు.

ఇదిలా వుంటే పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే చర్యల్లో భాగంగా అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (ఎంబీబీఎస్‌) చదివే విద్యార్థులకు రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌గా మొదటి ఏడాది రూ.50 లక్షల చొప్పున అందిస్తున్న ఏకైక యూనివర్శిటీగా గుర్తింపు తెచ్చుకుంది. పరిశోధనల్లో పరస్పర సహకారం అందించుకునే విధంగా నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపీహెచ్‌), సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గత 14 ఏళ్లలో 20 మందికే పీహెచ్‌డీలు ప్రదానం చేయగా.. ఈ ఏడాది 44 మంది దరఖాస్తు చేసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.