Mantralayam : తుంగభద్ర తీరాన..మంత్రాలయ రాఘవేంద్రుడు

ఆధోని నవాబు సిద్ధి మసూద్ ఖాన్ నుండి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. ప్రస్తుతం అదే మంత్రాలయంగా అంతా పిలుస్తున్నారు. మంత్రాలయంలో గురు పీఠం ఏర్పాటు చేసుకున్నారు.

Mantralayam : తుంగభద్ర తీరాన..మంత్రాలయ రాఘవేంద్రుడు

రాఘవేంద్రుని నిలయం...మంత్రాలయం (2)

Mantralayam : దక్షిణ భారత దేశ అధ్యాత్మిక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న మంత్రాలయం ప్రముఖ అధ్యాత్మిక ప్రదేశం. కారణ జన్ముడుగా చెప్పబడే గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం  తుంగభద్రా నదీ తీరంలో  కొలువుదీరి ఉంది. హిందూ మతంలో రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్రలలో స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

16వ శతాబ్ధంలో జీవించిన రాఘవేంద్ర స్వామి వైష్ణవాన్ని అనుసరించారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనభట్టు, గోపికాంబ దంపతులకు రాఘవేంద్రుడు జన్మించాడు. ఆయన అసలు పేరు వెంకటనాధుడు. 5సంవత్సరాల వయస్సులోనే అక్షరాభ్యసం ప్రారంభించి నాలుగు వేధాలను పఠించారు. యుక్తవయస్సుకు చేరుకున్న ఆయన సన్యాసం స్వీకరించి ఆయన పేరును రాఘవేంద్రునిగా మార్చుకున్నారు. అధ్యాత్మిక బోధనలతో తమిళనాడు, కర్నాటక ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతరకాలంలో మంత్రాలయం పంచముఖి వద్ద 12 ఏళ్ళపాటు తపస్సు చేసి ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకున్నట్లు చరిత్ర చెబుతుంది.

ఆధోని నవాబు సిద్ధి మసూద్ ఖాన్ నుండి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. ప్రస్తుతం అదే మంత్రాలయంగా అంతా పిలుస్తున్నారు. మంత్రాలయంలో గురు పీఠం ఏర్పాటు చేసుకున్నారు. స్వామి సజీవ సమాధి పొందిన తరువాత రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుండి తరలివస్తుంటారు. మంత్రాలయం సమీపంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతోపాటు, రాఘవేంద్రుని చేత ప్రతిష్టించబడిన వెంకటేశ్వర స్వామి దేవాలయం మంత్రాలయం సమీపంలో సందర్శించదగ్గ  ఆలయాలు.

మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి ప్రసాదం చాలా విశిష్టమైనది. పరిమళ భరితమైన ప్రసాదాన్ని భక్తులు ఎక్కువగా ఇష్టపడతారు. పరమపవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు. ఆలయంలో ఉన్న బంగారు, వెండి రధాలతో స్వామి వారి ఊరేగింపు ప్రదక్షిణ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. జనవరి 1వతేది కొత్త ఏడాది ప్రారంభంరోజున స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు ఉదయం 6గంటల నుండి మద్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి 9 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది. మంత్రాలయం చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. కర్నూలుకు 100కిలో మీటర్ల దూరంలో ఉంది.