Electric Vehicle Blast: మరో విద్యుత్ ద్విచక్ర వాహనం పేలుడు: వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు

ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్యాటరీ పేలి..ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ నగరంలో సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

Electric Vehicle Blast: మరో విద్యుత్ ద్విచక్ర వాహనం పేలుడు: వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు

Electric

Electric Vehicle Blast: దేశంలో విద్యుత్ ద్విచక్ర వాహనాల వరుస పేలుడు ఘటనలు వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అపటి వరకు ఎక్కి తిరిగిన వాహనం ఎప్పుడు పేలుతుందో తెలియక విద్యుత్ వాహన యజమానులు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు పేలుతుందో తెలియని టైం బాంబులాగా సీటు కింద యమడేంజర్ పెట్టుకు తిరుగుతున్నారు విద్యుత్ ద్విచక్ర వాహనదారులు. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్యాటరీ పేలి..ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ నగరంలో శనివారం చోటుచేసుకుంది. నగరంలోని సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నశివకుమార్ ఇటీవల కార్బెట్ 14 అనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశారు.

Also read:Kidnap Murder : కిడ్నాప్‌కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి హత్య

ఈక్రమంలో శుక్రవారం తాము నిద్రిస్తున్న గదిలోనే బైక్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు శివకుమార్. అయితే తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో బైక్ ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ఘటనతో శివకుమార్, అతని భార్య హారతి, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మేల్కొన్న ఇరుగుపొరుగు వారు.. వెంటనే శివకుమార్ ఇంటికి వచ్చి చూడగా అప్పటికే మంటలు భారీగా వ్యాపించి ఇంటిలో ఉన్న టీవీ, ఫ్రిజ్, ఏసీ ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. శివకుమార్ దంపతులు నిద్రిస్తున్న గది తలుపులు మూసి ఉండడంతో స్థానికులు బద్దలు కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Also read:USA Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు తెలుగు విద్యార్ధులతో సహా ముగ్గురు మృతి

ఈక్రమంలో శివకుమార్, అతని భార్య హారతిని జిజిహెచ్ కి తరలించగా.. చిన్నారులను స్థానిక రైన్ బో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వచ్చేలోగానే శివకుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన హారతి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఈ ఘటనపై బాధిత బంధువుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:Viral Video: ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లి మ్యాన్ హోల్లో పడిపోయిన మహిళ: వైరల్ వీడియో