Narasaraopet Lok Sabha constituency : పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో వేడెక్కుతున్న రాజకీయం.. అభ్యర్ధులను మార్చేపనిలో అధికార వైసీపీ, వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న టిడీపీ

పల్నాడు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ టిడిపి ల మద్య హోరాహోరి పోటి వుండేది. ఈ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ ఎక్కువసార్లు కైవసం చేసుకుంది. 2009 , 2014 లలో టిడిపి అభ్యర్ధులు గెలుపొందారు...మోదుగుల, రాయపాటి గెలుపొందారు... .2019 ఎన్నికలలో వైసిసి యంపి గా లావు శ్రీక్రిష్ణ దేవరాయలు గెలుపొందారు. గత ఎన్నికలలో రాయపాటి పోటి చేసి ఓటమి పాలయ్యారు..

Narasaraopet Lok Sabha constituency : పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో వేడెక్కుతున్న రాజకీయం.. అభ్యర్ధులను మార్చేపనిలో అధికార వైసీపీ, వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న టిడీపీ

NARASARAOPET

Narasaraopet Lok Sabha constituency : పల్నాడు.. పౌరుషాల పురిటిగడ్డ. గత ఎన్నికల్లో.. నరసరావుపేట పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలను.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మరి.. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా? అదే.. ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఇక్కడి రాజకీయం కాస్తా వేడెక్కుతోంది. బాగా పట్టున్న పల్నాడులో.. టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మరి.. రాబోయే ఎన్నికల కోసం పసుపుదళం ఎలాంటి వ్యూహాలు రెడీ చేస్తోంది? అభ్యర్థులు మారే అవకాశం ఏమైనా ఉందా? కొత్త క్యాండిడేట్లు.. బరిలోకి దిగబోతున్నారా?

నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో.. 2019 ఎన్నికల్లో తొలిసారి వైసీపీ గెలిచింది. గెలవడమే కాదు.. దాని పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ విక్టరీ.. స్టేట్ మొత్తం రీసౌండ్ వచ్చింది. ఇటీవలే.. నరసరావుపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రాంతం.. పల్నాడు జిల్లాగా మారింది. ఇందులో.. ఏడు నియోజకవర్గాలుంటే.. అందులో ఐదింటిలో టీడీపీ అభ్యర్థులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. వాళ్లే.. పల్నాడు జిల్లాను శాసిస్తూ ఉంటారు. అయినప్పటికీ.. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌ను తట్టుకోలేకపోయారు.

READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

గురజాలలో మాజి టిడిపి ఎమ్మెల్యే యరపతినేని గెలవకూడదంటూ తన సామాజిక వర్గానికి చెందిన నేతలు రాజకీయం చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలకు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆయనపై గుర్రుగా వున్నారు. పెదకూరపాడులో అన్ని తానై చూసుకున్నవైసిసి ఎమ్మెల్యే గా నంబూరు శంకర్రావు గెలవడానికి కారణమైన పీసపాటి సాయిని పక్కన పెట్టడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. మంత్రి విడుదల రజనీ కి, యంపి శ్రీక్రిష్ణదేవరాయలుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి వుంది. ఎన్నికల వేళ తనకు సహకరించలేదని మర్రి రాజశేఖర్ పై కొంత కాలం విడదల రజని గుర్రుగా వున్నారు. ఇప్పుడు ఆయనకు జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మంత్రి కాకముందు నియోజక వర్గంలో అన్ని తానై నియంత్రుత్వ దోరణ ప్రదర్శించారని ఇప్పడు కాస్త స్లో అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. వినుకొండలో వైసిసి గెలుపు కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టడం వైసిపి లోని సెకెండ్ కేడర్ జీర్గించుకోలేకపోతున్నారు. పల్నాడు లో జనసేన పార్టి బలం పుంజుకుంటోంది. కన్నా టిడిపిలోకి చేరడంతో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

KRISHNA DEVARAYALU, KANNA, RAYAPATI

colorful abstract painting texture and background

పల్నాడు వైసీపీలో గ్రూపుల పోరు…బలపడ్డ తెలుగుదేశం పార్టీ

పల్నాడు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ టిడిపి ల మద్య హోరాహోరి పోటి వుండేది. ఈ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ ఎక్కువసార్లు కైవసం చేసుకుంది. 2009 , 2014 లలో టిడిపి అభ్యర్ధులు గెలుపొందారు…మోదుగుల, రాయపాటి గెలుపొందారు… .2019 ఎన్నికలలో వైసిసి యంపి గా లావు శ్రీక్రిష్ణ దేవరాయలు గెలుపొందారు. గత ఎన్నికలలో రాయపాటి పోటి చేసి ఓటమి పాలయ్యారు..ఆయన ఆరోగ్యం సహకరించడంలేదు..ఆయన వారసుడిని రాజకీయాలలోని తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. వైసిపి యంపి లావు శ్రీక్రిష్ణ దేవరాయలకు ఎమ్మెల్యే విడదల రజని , బొల్లా బ్రహ్మనాయుడుకి పొసగడం లేదు.. ఆయన తన అబివ్రుద్ది కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. చిలకలూరి పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విడదల రజనికి ఆశించినంత స్తాయిలో ఓట్లు రాలేదని మర్రి రాజశేఖర్ తో ఆయన కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు విన వచ్చాయి..దీంతో ఆయన వర్గం గుర్రుగా వున్నారు…టిడిపి పార్టిలోకి వెళతారని జోరుగా ప్రచారం జరిగింది. కాని అనూహ్యంగా మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి వరించింది. 2014 ఎన్నికలలో లావు ఇక్కడ నుండి పోటీ చేసే అవకాశం వుంది. టిడిపి లో పుట్టాసుదాకర్ యాదవ్ పోటి చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే కన్నా టిడిపి పార్టి లోకి చేరడంతో సమీకరణాలు మారుతున్నాయి. కన్నా ఆయన తనయుడు యంపిగా పోటీ చేసే అవకాశం వుంది…నరసరావుపేట నుండి పోటి చేస్తారనే ప్రచారం వుంది…రాయపాటి వర్గం ఆయనకు ఏమేరకు సహకరిస్తారో అనేది తేలాలి. గతంలో బిజెపి ఎంపి గా కన్నా ఇక్కడనుండి పోటీ చేశారు…జివియల్ ఇక్కడనుండి పోటీ చేస్తారని అనుకున్న ఆయన వైజాగ్ నుండి పోటీ చేస్తారని అనుకుంటున్నారు. టిడిపి పార్టి నుండి కొత్త అబ్యర్దులు పోటీ చేస్తారా లేకా కన్నా పణీంద్రకు ఇస్తారా అనేది తేలాలి.

vidadala rajini, pullarao

vidadala rajini, pullarao

చిలకలూరిపేటలో అధికార పార్టీలో గ్రూపుల గోల…తెలుగుదేశం టిక్కెట్ తిరిగి పుల్లారావుకు దక్కేనా?

పల్నాడు జిల్లాలో ఎన్నికలకుముందే రాజకీయం వాడి వేడిగా సాగుతుంది. చిలకలూరిపేట జాతీయ రహదారి16 పై రెండు వైపులా విస్తరించి ఉన్న నియోజకవర్గమే చిలకలూరిపేట….. చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు మండలాలు వున్నాయి..చిలకలూరిపేట, నాదెండ్ల,యడ్లపాడు మండలాలు వున్నాయి… రెండు లక్షల 24 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొదటి నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టి గెలుస్తూ వస్తోంది. సోమేపల్లి సాంబయ్య గెలుపొందుతూ వచ్చారు. తరువాత పత్తిపాటి పుల్లారావు మూడు సార్లు టిడిపి తరుపున గెలుపొందారు..సోమేపల్లి సాంబయ్య వారసుడిగా మర్రి రాజశేఖర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలుపొందుతూ వచ్చారు. తరువాత వైస్సార్ కాంగ్రెస్ పార్టిలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలలో వైసిపి తరుపున విడదల రజని గెలుపొందారు. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపోందినా ఆమె మంత్రి పదవి వరించింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇప్పటిదాకా గెలుస్తూ వచ్చారు. ఆసామాజిక వర్గానికి చెందిన వారిని కాదని బిసి మహిళను పోటీకి నిలబెట్టడంలో వైసిపి గెలుపుసాదించింది. అయితే ఇక్కడ మొదట టిడిపి లో వుండి తరువాత వైసిపి పార్టిలోకి విడదల రజని వచ్చారు. ఆమె గెలుపొందిన దగ్గరనుండి అదికారులను ముప్పతిప్పలు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత కాలంలో అందుబాటులో ఉండరని ప్రజలు చెప్పుకుంటున్నారు. పెత్తనం అంతా కూడా పిఎ ల కనుసన్నలలో సాగుతుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల ఫోన్ లకు కూడా స్పందించరని ప్రజాప్రతినిది అన్న మాట మరచి కార్పోరేట్ సిఇఓ లాగా వ్యవహరిస్తారని ప్రజలు చెప్పుకుంటున్నారు.. క్షేత్రస్తాయిలో ఏమి జరుగుందో తెలియకుండానే పిఎలు చెప్పినట్లు వింటారని ప్రచారం జరుగుతుంది. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో విస్త్రుతంగా ప్రచారం చేసి గెలుపొందిన తరువాత ప్రజలు ను పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. మర్రి రాజశేఖర్ కు రావలసిన టికెట్ విడదల రజనికి వరించింది.

READ ALSO : Chittoor Lok Sabha Constituency : చిత్తూరులో ఫ్యాన్ పార్టీ పట్టునిలుపుకుంటుందా?..అధికార పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహాలేంటి?

అయితే యంపి శ్రీక్రిష్టదేవరాయలు రజనికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి వుంది. మంత్రి పదవికోసం మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ రాకుండా చక్రం తిప్పారనే అపవాదును మూట కట్టుకున్నారు. యంపి శ్రీక్రిష్టదేవరాయలు, మర్రి రాజశేఖర్ లు టిడిపి పార్టిలోకి వెళతారని విపరీతంగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా మర్రిరాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి వరించింది…దీంతో ఇప్పటికి వరకు నియోజకవర్గంలో ఎదురు లేకుండా ఉన్నరజని వర్గానికి కొంత షాక్ తగిలింది. నియోజకవర్గంలో ఎప్పటినుంచో బైరా వర్సెస్ విడదల వర్గానిక పడేదికాదు… ఇప్పుడు మొత్తం కూడా ఒక వర్గం గా ఏర్పడ్డారు. మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి రావడంతో రజని వర్గానికి షాక్ గురవుతున్నారు. టిడిపి నుండి 3 సార్లు ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయిన పత్తిపాటి పుల్లారావు 2019 ఎన్నికలలో ఓడిన తరువాత కార్యకర్తలకు కనుమరుగైపోయారు. దేవుని దర్శనం అయిన అందుతుంది కాని పుల్లారావు దర్శనం అందదని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.. పుల్లారావు మంత్రిగా వున్నప్పుడు వున్న అనుచరగణం కనుమరుగైపోయారు. ఆయన తన వ్యాపారాల మీద ద్రుష్టిని కేంద్రికరించడంతో హైదరాబాద్ కు ఆయన పరిమితం అయ్యారు. టిడిపి చేపట్టే నిరసన కార్యక్రమాలకు అడపాదడపా తప్పితే ఎక్కడా ఆయన కనబడటం లేదు…ఈ సారి ఎన్నికలలో ఆయనకు టికెట్ లేదని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రి పదవి తప్పించకుండా మరొక శాఖకు ఆయను మార్చారు. చంద్రబాబు ప్రజలకు నిత్యం అందుబాటులో వుండే నాయకులకే టిక్కెట్లు ఇస్తామని చెప్పడంతో పుల్లారావు పోటీపై సందిగ్దత నెలకొంది. విడదల రజని ని ఎదుర్కొవాలంటూ గట్టి అబ్యర్దిని పోటీకి దింపాలని టిడిపి కార్యకర్తలు కోరుతున్నారు.

sankararao,sridhar,kanna

sankararao,sridhar,kanna

పెదకూరపాడులో పెరిగిన టిడిపి బలం…కన్నా చేరికతో వైసీపీలో టెన్షన్

పెదకూరపాడు నియోజకవర్గం క్రిష్ణా నదీ తీర పరివాహక ప్రాంతం ఇక్కడ ఎక్కువగా ఇసుక రీచ్ లు ఉన్న ప్రాంతం..ఇక్కడు ఎప్పుడు ఒకరిపై ఒకరు ఆదిపత్య పోరు నడుస్తూనే వుంటుంది…ఈ నియోజకవర్గం మొదటినుండి కాంగ్రెస్ హవా వున్న ప్రాంతం….మాజి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టిడిపి తరుపున రెండు సార్లు కొమ్మాల పాటి శ్రీదర్ గెలుపొందారు…2019 ఎన్నికలలో వైసిపి తరుపున నంబూరు శంకరరావ్రు గెలుపొందారు…పెదకూరపాడు పరిదిలో మొత్తం 5 మండలాలు వున్నాయి.. అమరావతి, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ,పెదకూరపాడు మండలాలు… కన్నాబిజెపిని వీడి టిడిపి కండువా కప్పుకోవడంతో ఈ నియోజకవర్గంలో కన్నా అనుచరులు టిడిపిలోకి వచ్చారు…టిడిపి పార్టిని పెదకూరపాడులో బలోపేతం చేసేందుకు కన్నా తన అనుచరులతో మీటింగ్ లు ఏర్పాటు చేశారు.

టిడిపినుండి గత ఎన్నికల్లో పోటీచేసిన కొమ్మాలపాటి శ్రీదర్ అనేక ఆరో్పణలు ఎదుర్కొన్నారు. లిక్కర్ సిండికేట్..ఇసుక మాఫియాకు అండగా నిలిచారని అపవాదు వుంది…టిడిపి అదికారంలో వున్నప్పడు దాదాపుగా 12 ఇసుక రీచ్ లు వుండేవి…అయితే అబివ్రుద్ది అనేది శూన్యం అని ప్రజలు ఆయనను తిరస్కరించారు. నియోజకవర్గానికి కొత్త అబ్యర్ది అయిన నంబూరు శంకర్రావు ఆదరించారు నియోజకవర్గప్రజలు…టిడిపి తరుపున కొమ్మాలపాటి శ్రీదర్ కు టికెట్ లేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కొత్త అబ్యర్ది అయితేనే ప్రజలు ఆదరిస్తారని చెబుతున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు పల్నాడు జిల్లాలో వున్నారు.దీంతో ఇక్కడ టికెట్ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అటు నంబూరు శంకర్రావు నియోజవకవర్గంలో అబివ్రుద్ది చేసిన ఆయన అందుబాటులో వుండడనే ప్రజలు చెబుతున్నారు. వారంలో రెండు రోజులు మాత్రమే నియోజకవర్గంలో వుంటారని వ్యాపారాలతో బిజిగా వుంటారని నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పీసపాటి సాయి చూసుకునేవారు. కోడెల మేనల్లుడు పీసపాటి సాయి మొదటినుండి ఆయన టిడిపిలో వుండేవారు. కొమ్మాలపాటి శ్రీదర్ ను గతంలో గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.తరువాత టిడిపి లో ఆయనకు ప్రాదాన్యత ఇవ్వకపోవడంతో టిడిపిని వీడి వైసిసి వచ్చారు. తరువాత అన్నీ తానే అయి నంబూరి శంకర్రావు ను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. నంబూరి శంకర్రావు కార్యక్రమాలను ఆయనే చక్కబెట్టేవారు. ఇసుక రీచ్ ల వాటాల విషయంలో తేడాలు రావడంతో ఎమ్మెల్యేకు , సాయి కి విబేదాలు వచ్చాయి. దాంతో సాయిని పార్టినుండి సస్పెండ్ చేశారు. ఒకవైపు టిడిపిలో కన్నా చేరికతో టిడిపి వర్గాలలో ఆనందం వ్యక్తం అవుతుంది. నియోజకవర్గంలో వైసిపి పార్టికి సాయి వెళ్లిపోవడం తో పాటు ద్వీతీయ శ్రేణి నాయకులు అసంతృప్తి నెలకొంది…స్తానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు సాయి విబేదాలు వైసిపి పార్టి కి మైనస్ గా వుంది.. టిడిపి తరుపున ఎమ్మెల్యేగా కొత్త అబ్యర్దిని పెడతారని నాయకులు చెబుతున్నారు…ఈ సారి ఎన్నికలు అంత ఆషామాషివ్యవహారం కాదు..తగ్గపోరుగా వుండే అవకాశాలు వున్నాయి. టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తే టిడిపి గెలుపుకు అవకాశాలు వుంటాయిని చెబుతున్నారు.

ambati rambabu, kanna, srinivasyadav

ambati rambabu, kanna, srinivasyadav

సత్తెన పల్లి టిడిపిలో మూడుముక్కలాట.. అభ్యర్ధుల గెలుపులో కీలకం కానున్న కాపు ఓటర్లు

సత్తెనపల్లి నియోజకవర్గం పూర్వం కమ్యూనిష్టులు ప్రాభవం ఎక్కువగా ఉంటుంది…నియోజకవర్గం టిడిపికి కంచుకోట అటువంటి నియోజకవర్గంలో ఇరు పార్టిలలోను వర్గపోరు పూర్తిగా నడుస్తోంది. ఆదినుండి టిడిపి ప్రాబల్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గం..సిపియం పొత్తులో బాగంగా గతంలో పుతుంబాక బారతి ఇక్కడనుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత కాంగ్రెస్ తరుపున యర్రవెంకటేశ్వర రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైవి ఆంజనేయులు ఇక్కడనుండే గెలుపొందారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కొడెల సత్తెనపల్లి నుండి పోటీ చేసి గెలుపొందారు. సత్తెనపల్లి లో అబివ్రుద్ది అంటే కోడెల అని ప్రజలు అంటున్నారు.. 2019 ఎన్నికలలో ఆయన అంబటిరాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన తీవ్రమనస్తాపం చెంది మరణించారు. ఇక్కడ కాపు సామాజిక ఓటర్లు గెలుపోటములు నిర్ణయిస్తారు.. గతంలొను అంబటి రాంబాబు గ్లాసు నాకు గునపం రా బాబు నన్ను కాపులునన్న గెలిపించమని అబ్యర్దించిన పరిస్తితి ఉంది…కోడెల మరణం తరువాత ఇక్కడ టిడిపి నియోజకవర్గఇన్ చార్జ్ ను నియమించలేదు.. ఇక్కడ టిడిపి పార్టి మూడు ముక్కలయ్యింది.. కోడెల తనయుడు శివరాం పార్టి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాడు…వైవి ఆంజనేయులు, అన్నా క్యాంటిన్ ల నిర్ణయంలోను ముగ్గరు మూడు క్యాంటిన్ లు ఏర్పాటు చేశారు.. ఎవరికి వారే అన్న దోరణిలో ప్రవర్తిస్తున్నారు.. ఇది ప్రస్తుతానికి వైసిపికి కలసి వచ్చే అంశం.

READ ALSO : Nellore Lok Sabha Constituency : సింహపురిలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా ? నెల్లూరు టీడీపీలో కనిపిస్తున్న కొత్త జోష్

ఇక్కడ జనసేన పార్టి అబ్యర్దిగా బోనబోయిన శ్రీనివాసయాదవ్ పార్టి కార్యక్రమాలో నిమగ్నమయ్యారు,…టిడిపి, జనసేన పొత్తులో బాగంగా ఇక్కడ జనసేను ఇచ్చే అవకాశం వుంది. ఇక్కడ కన్నాకు అనుచర గణం ఎక్కువ.. ఆయన టిడిపిలో చేరడంతో టిడిపి కొంత ప్లస్ అయ్యే అవకాశం వుంది…మంత్రి అంబటి రాంబాబుపై అనేక ఆరోపణనలు వినవస్తున్నాయి… అంబటి నియోజకవర్గంలో ఎక్కువగ ఉండరు అనే నానుడి వుంది. ఆయన కార్యకర్తల మాట విను అని ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు.. రెడ్డి, మైనార్టి వర్గాలలో ఆయన కు వ్యతిరేఖంగా వున్నారు. అసమ్మతి రాగం ఎక్కువగా వినవస్తుంది. జనసేన పార్టి అదినేత పవన్ కల్యాణ్ పై ఆయన విమర్శలు చేయడం కాపులకు కొంత మింగుడుపడటం లేదు. తమ సామాజిక వర్గనేత పవన్ కల్యాణ్ ను విమర్మించడం వారిన నచ్చడం లేదు…బహింరంగంగానే ఆయనపై విమర్శలు చేస్తున్నారు కాపునేతలు… గతంలో అంబటి రాంబాబు తమ్ముడు అంబటి మురళి పార్టి వ్యవహారాలు చూసూకునేవారు. తరువాత ఆయనపై అవినీతి అబియోగాలు రావడంతో గుంటూరు కే పరిమితమయ్యారు.మొత్తానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు ఓటింగ్ జయాపజయాలను నిర్ణయించే అవకాశం వుంది.

srinivasa reddy, aravindhababu

srinivasa reddy, aravindhababu

నరసరావుపేటలో పట్టుకోసం టిడిపి ప్రయత్నాలు…వైసీపీ నుండి తిరిగి ఎన్నికల బరిలోకి గోపిరెడ్డి

నరసరావుపేట ఒకప్పడు ప్యాక్ష్యన్ కు పెట్టింది పేరు. ఇక్కడ కోడెల వర్సెస్ ,,కాసు ఇద్దరు హోరా హోరిగా వుండేవారు.. ఇక్కడ నుండి కోడెల 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.తరువాత సమీకరణాలలో బాగంగా సత్తెనపల్లి నుండి ఆయన పోటి చేసి గెలుపొందారు. గత రెండు ఎన్నికల నుండి వైసిపి నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపొందుతూ వస్తున్నారు. ఈ సారి హాట్రిక్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. కోడెల వర్గం అంటే నరసరావుపేట లా వుండేది. ఆయన మరణం తరువాత టిడిపి పార్టిలో పెద్దగా కేడర్ యాక్టివ్ గా లేకుండా పోయారు. ఇన్ చార్జ్ గా వున్న అరవింద్ బాబు యాక్టివ్ గా వున్నా ఆయన నాయకత్వాన్ని కొంత మంది టిడిపి నాయకులు జిర్ణించుకోలేక పోతున్నారు. ఇక్కడ వైసిసి టిడిపి బలంగా వున్నాయి. గత ఎన్నికలలో అరవింద్ బాబు ఓడిన ప్రజలకు ఎల్లప్పడు అందుబాబులో వుంటూ వుండారు..జనసేన టిడిపి పొత్తు వుంటే తమ గెలుపు ఖాయమని టిడిపి నాయకులు చెబుతున్నారు. కన్నా టిడిపిలోకి చేరడంతో పల్నాడు జి్ల్లాలో టిడిపికి కొంత ఓటు బ్యాంకు పెరిగింది.1983 నుండి 2004 వరకు కోడెల శివప్రసాదరావు గెలుస్తూ వచ్చారు…5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు…గతంలో నరసరావుపేటలో మూడు మండలాలు వుండేవి..నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు..తరువాతి కాలంలో నకరికల్లును సత్తెనపల్లిలో కలిపారు…టిడిపి కి పట్టువున్న ప్రాంతం నకరేకల్లు ….సత్తెనపల్లిలో కలపడంతో రెండు సార్లు ఓటమి పాలయ్యారు. కాసు క్రిష్ణారెడ్డి గెలపోందుతూ వచ్చారు. తరువాత 2014 ,2019 లొ వైయస్పార్ కాంగ్రెస్ పార్టి నుండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు… కోడెల వర్గం ఆయన ..కొంత చెల్లా చెదురయ్యింది,,ఇన్ చార్జ్ గా వున్న అరవింద్ బాబు వున్న ఆయనకు కేడర్ కొంత సహకరించడంలేదు….పలు అబివ్రుద్దిపనులను గోపిరెడ్డి చేశారు…దీంతో టిడిపి తరుపున చదలవాడ అరవింద్ బాబు, వైసిపి తరుపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేసే అవకాశంవుంది. జనసేన నుండి జిలాని పోటి చేసే అవకాశం వుంది….

bolla brahamanaidu,anjaneyulu

bolla brahamanaidu,anjaneyulu

వినుకొండలో అధికారపార్టీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి ఎదురుగాలి.. జనసేనపొత్తుతో గెలుపు ఖాయమన్న ధీమాలో టిడీపీ

వినుకొండ నియోజక వర్గంలో పూర్వం కమ్యూనిష్లులు ప్రబావం ఎక్కువ గా ఊండేది..జివి ఆంజనేయులు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు..2019 ఎన్నికలలో బొల్లా బ్రహ్మనాయుడు వైసిసి తరుపున గెలుపొందారు…గతంలో్ టిడిపి పార్టి కమ్యూనిష్ట్ లు అండగా వుండేవారు…ప్యాన్ గాలి ప్రబావంతో 2019 ఎన్నికలలో బొల్లా బ్రహ్మనాయుడు గెలుపొందారు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో జివి ఆంజనేయులు జిల్లా అద్యక్షలుగావుండేవారు. దాంతో ఆయన ఎక్కువగా గుంటూరులోనే వుండేవారు. ఆయన కారలంలో అబివ్రుద్ది అనేది జరగలేదు అని , మంచినీటి సమస్య వీపరీతంగా ఉండేది దానిని ఆయన నిర్లక్ష్యం చేశారని ప్రజలు చెబుతున్నారు. సొంత కేడర్ మరిచారని విమర్మలు వున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ లో వ్యాపారాలు ఎక్కువగా చూసుకునేవారని చెబుతున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్చే మక్కెన మల్లిఖార్జునరావును కలుపుకు పోవడంతో ఆయనకు కలిసి వచ్చింది. మాజి కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు సొంత కేడర్ వుంది…బొల్లా కోసం ఆయన పనిచేశారు. ఎన్నికల తరువాత ఆయన చేపల చెరువులను మంచినీటి చెరువులుగా మార్చారు తరవాత మక్కెనను దూరం పెట్టడంతో కొంత కేడర్ దూరం అయింది. అబివ్రుద్ది కొంత వరకు చేసిన జగనన్న ఇళ్లకోసం ఆయన పొలం ఇచ్చి బారి లబ్ది పొందారని ఆరోపణలువున్నాయి… స్వలాబం కోసం ఆయన పని చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. యంపి క్రిష్ణదేవరాయలు కు ఆయనకు పొసగడం లేదు..సెకెండ్ కేడర్ బొల్లాకు కొంత దూరం అయ్యారు..ఈ సారి ఎన్నికలలో ఇరు వర్గాల మద్య హోరా హోరి వుండే అవకాశం వుంది. జనసేనతో కలిస్తే టిడిపి కొద్దిగా లబ్ది చేకూరే అవకాశం వుంది.

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

ramakrishna reddy,brhamareddy

ramakrishna reddy,brhamareddy

మాచర్లలో హోరాహోరీ పోరు తప్పదా? తిరిగి బరిలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి…టిడిపి అభ్యర్ధిగా జూలకంటి బ్రహ్మారెడ్డి

మాచర్ల నియోజకవర్గం సున్నపురాళ్లు, సిమెంట్ పరిశ్రమలు ,సహజవనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతం లో ప్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగానే వున్నాయి…కారంపూడి, రెంటచింతల, దుర్గి, వెల్తుర్ది, మాచర్ల మండలాలు వున్నాయి. కారంపూడి, దుర్గి, మండలాలు టిడిపి కి ఎక్కువ పట్టువున్న ప్రాంతాలు.. మాచర్ల పట్టణంలో ను టిడిపి కి గట్టి కేడర్ వున్న ప్రాంతం..1989 నుండి 2004 వరకు టిడిపి హవా కొనసాగింది తరువాత నుండి 2004 నుండి పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టి నుండి గెలుపొందారు. తరుతాతి 2009 నుండి పిన్నెల్లి రామక్రిష్టారెడ్డి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇప్పటివరకు తిరుగులేకుండా పిన్నెల్లి వర్గం కొనసాగుతుంది. జడ్ పిటిసి, యంపిటిసి, మున్సిపల్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి, ఇటీవల జరిగిన హత్యలు జల్లయ్య, చంద్రయ్య, పాపిరెడ్డి హత్యలు పిన్నెల్లి వర్గం చేసిందని టిడిపి ఆరో్పిస్తోంది. ఎన్నికలు జరగకకుండా బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఒకరుపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికలప్పుడు ప్రతిసారి టిడిపి పార్టి నుండి కొత్త అభ్యర్ధిని పెట్టడంతో అక్కడ ఓడిపోతున్నామని టిడిపినేతలు బావిస్తున్నారు. కొత్త ఇన్ఛార్జి గా బ్రహ్మనాయుడు వచ్చిన తరువాత టిడిపి కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు.,..ఇదేంకర్మ ప్రొగ్రాం చేస్తున్నప్పుడు టిడిపి కార్యాలయం తగులబెట్టారని, అలాగే కార్లను ద్వంసం చేశారని ఆరోపిస్తున్నారు.. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని చెబుతున్నారు.. ఇక్కడ టిడిపి ఇన్ఛార్జిగా బ్రహ్మరెడ్డి వచ్చిన తరువాత పూర్తిగా యాక్టివ్ అయ్యారు. ఈ సారి ఎన్నికల పోరు హోరాహరీగా ఉండే అవకాశం ఉంది. టిడిపి తరుపున బ్రహ్మారెడ్డి, వైసిపి తరుపున పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది…ప్రదానంగా టిడిపి వైసిపి పార్టీల మద్య పోటీ వుండే అవకాశం వుంది..జనసేన ప్రబావం పెద్దగా వుండే అవకాశం లేదు…

READ ALSO : Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

kasu mahesh, yarapathineni

kasu mahesh, yarapathineni

గురజాలలో అధికార వైసీపీలో గ్రూపుల గోల.. టిక్కెట్ కోసం తెలగుదేశంలో నేతల మధ్య పోటాపోటీ

గురజాలలో నియోజకవర్గంలో టిడిపి వైసిపి పార్టిల మద్య పోరు నువ్వానేనా అన్నట్లు వుంది…టిడిపి పార్టినుండి యరపతినేని ప్రాతినిద్యం వహిస్తుండగా వైసిపి పార్టినుండి 2019 ఎన్నికలలో కాసు మహేష్ రెడ్డి విజయం సాదించారు… నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే కాసు వర్సెస్ ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి వర్గాలుగా విడిపోయి విడివిడిగా కార్యక్రమాలు చేసుకునే స్థితికి వెళ్ళిపోయారు ఇదే ఇలా కొనసాగితే 2024 లో వైసీపీకి గడ్డు కాలమేనని అంటున్నారు అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సెకండ్ క్యాడర్ను పట్టించుకోవట్లేదని కొన్ని విమర్శలు ఉన్నాయి.. పట్టించుకోని సగం క్యాడర్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తో తమ గోడు వెళ్లబోసుకున్నారు..

తన వర్గానికి చెందిన వారికి కనీసం చిన్న చిన్న పనులు కూడా చెయ్యడం లేదని జంగా కృష్ణమూర్తి గుర్రుగా ఉన్నాడు.. జంగా కృష్ణమూర్తి కూడా తమ అనుచరులతో పనులు ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయల తో చక్కపెట్టుకుంటున్నడు. నియోజకవర్గంలో ఇంత జరుగుతున్న వైసిపి అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. వైసీపీ నాయకులు రెండు గా చీలిపోయి కొంతమంది ఎమ్మెల్యే కాసు వద్దకు కొంతమంది ఎమ్మెల్సీ జంగా వద్దకు వెళ్తున్నారు

2024 ఎలక్షన్లో కాసు మహేష్ రెడ్డికి మళ్ళీ అధిష్టానం సీట్ ఇస్తే ఎమ్మెల్సీజంగా వర్గం అనుకూలంగా పనిచేయదనే విమర్శలు కూడా ఉన్నాయి ఇదే జరిగితే వైసిపి గురజాల లో ఓడిపోవడం ఖాయమని తెలుస్తుంది..అలాగే నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి కూడా అంతంతా మాత్రంగానే వుంది.. నియోజకవర్గంలో బలమైన నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కి తప సామాజిక వర్గం లోని కొందరు తలనొప్పిగా తయారయ్యారు..ఈసారి గురజాల నియోజకవర్గానికి టిడిపి టికెట్ పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు

డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాసరావు అలాగే జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎన్ఆర్ఐ చింతలపూడి శ్రీనివాసరావు మరికొంతమంది టికెట్ ను ఆశిస్తుండటం తో యరపతినేని శ్రీనివాసరావుకి తలనొప్పిగగా మారింది. అయితే టిడిపి జనసేన పొత్తు పెట్టుకుంటే పొత్తులో భాగంగా యరపతినేని శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు వుంటాయి. గురజాల నియోజకవర్గంలో ఇక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉండటం తో పొత్తు పెట్టుకుంటే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది… పొత్తు పెట్టుకోకపోతే మాత్రం టిడిపికి గడ్డు కాలమని చెప్పాలి.. కన్నా కాపు సామాజిక వర్గం మీదనే యరపతినేని ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది..

అలాగే నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా ఇక్కడ బలంగానే ఉంది. జనసేన పార్టీ తరఫున నియోజకవర్గం ఇన్చార్జి లేకపోవడం తో కొంచెం వెనకంజలో ఉన్న పార్టీ మండల అధ్యక్షులు నియమించడంతో కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. నియోజకవర్గంలో 2019లో దాదాపు 14 వేల ఓట్ల తెచ్చుకున్న జనసేన పార్టీ అప్పుడు అభ్యర్థి చింతలపూడి శ్రీనివాసరావు నీ జనసేన క్యాడర్ నమ్మలేదని ఒక ప్రచారం జరిగింది. ప్రజలకు చేరువయ్యేందుకు పలుసేవా కార్యక్రమాలు చేపట్టారు…కానీ సరైన అభ్యర్థి జనసేన పార్టీ తరఫున గురజాల నియోజకవర్గంలో దిగితే త్రిముఖ పోటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు.

READ ALSO : Kurnool Lok Sabha Constituency : వచ్చే ఎన్నికల్లో కొండారెడ్డి బురుజుపై జెండా పాతేది ఎవరు….ఆసక్తి కరంగా కర్నూలు రాజకీయాలు

కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఇక్కడ మరొక గెట్టి సామాజిక వర్గనికి చెందిన వ్యక్తిగనుక పోటీ చేస్తే త్రిముఖ పోటీ తప్పదని చెప్పుకోవాలి. గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్యే కాసుని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని కూర్చోబెట్టి మాట్లాడి ఎమ్మెల్సీ జంగా అసంతృప్తి చల్లారిస్తే తప్ప వైసీపీకి మనుగడ లేదని చెప్పాలి.. యరపతినేని అధికారంలో వున్నప్పుడు కేడర్ ను దగ్గరకు రానివ్వలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మైనింగ్ సంబందించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. యరపతినేని వర్సెస్ కాసు నిత్యం వార్తల్లో నిలుస్తూ వుంటారు. ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకుంటూ వుంటారు. కాసు ప్రజలకు అందుబాటులో వుండరని చెబుతున్నారు…టిడిపిలోను , వైసిపిలోను గ్రూపు రాజకీయాలతో నియోజకవర్గం లో ప్రజలు సతమతవుతున్నారు.