AP MLC Elections-2023: టీడీపీ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపు

జై టీడీపీ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. వైసీపీ అంతర్మథనంలో పడింది. క్రాస్ ఓటింగ్ పై సమాలోచనలు చేస్తోంది. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించింది.

AP MLC Elections-2023: టీడీపీ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపు

AP MLC Elections 2023

AP MLC Elections 2023: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. టీడీపీ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలిచారు. ఇవాళ వెల్లడించిన ఫలితాల్లో ఆమె 23 ఓట్లు దక్కించుకున్నారు. వైసీపీ క్రాస్ ఓటింగ్ వల్లే అనురాధ విజయం సాధించారని తెలుస్తోంది. పంచుమర్తి అనురాధ గెలుపుతో కేరింతలలో టీడీపీ కార్యకర్తలు అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ లో బాణసంచా కాల్చి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

జై టీడీపీ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్సాహంతో ఉన్నారు. వైసీపీ అంతర్మథనంలో పడింది. క్రాస్ ఓటింగ్ పై సమాలోచనలు చేస్తోంది. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించింది. టీడీపీ తరపున బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధ విజయానికి 22 ఓట్లు అవసరం కాగా, ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. ఆమె విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఆ ఇద్దరు ఎవరు?

కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరిగింది. వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు టీడీపీకి పడ్డాయని ప్రచారం జరుగుతోంది. టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది.

రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు అనంతరం వైసీపీ అభ్యర్థుల తుది ఫలితాలు తేలే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి..

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు

మర్రి రాజశేఖర్ 22 ఓట్లు
సూర్యనారాయణ రాజు 22 ఓట్లు
జయమంగళ వెంకట రమణ 21 ఓట్లు
కోలా గురువులు 21 ఓట్లు
బొమ్మి ఇజ్రాయిల్ 22 ఓట్లు
పోతుల సునీత 22 ఓట్లు
యేసు రత్నం 22 ఓట్లు

TSPSC paper leak: గ్రూప్-1లో అధిక మార్కులు వచ్చిన ఇద్దరితో పాటు మరో నిందితుడికి రిమాండ్.. చంచల్ గూడ జైలుకి తరలింపు