Andhra Pradesh MLC Election 2023 : ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ..గెలుపుపై వైసీపీ ధీమా, క్రాస్ ఓటింగ్‌పై టీడీపీ ఆశలు

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. వైసీపీ ఏడుగురు అభ్యర్ధులను పోటీలో నిలబెట్టి గెలుపుపై ధీమాగా ఉంది. టీడీపీ మాత్రం వైసీపీ అసంతృప్తులు తమకు ఓటు వేస్తారనే ఆశలు పెట్టుకుంది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

Andhra Pradesh MLC Election 2023 : ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ..గెలుపుపై వైసీపీ ధీమా, క్రాస్ ఓటింగ్‌పై టీడీపీ ఆశలు

Andhra Pradesh MLC Election 2023 : ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.151 ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీ ఏడుగురు అభ్యర్ధులను పోటీలో నిలబెట్టి గెలుపుపై ధీమాగా ఉంది. టీడీపీ మాత్రం వైసీపీ అసంతృప్తులు తమకు ఓటు వేస్తారనే ఆశలు పెట్టుకుంది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఈ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు కూడా జోరుగా సాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం మా పార్టీలో ఎటువంటి అసంతృప్తి నేతలు లేరని చెబుతోంది.గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తోంది. కానీ  టీడీపీ మాత్రం క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్నట్లుగా ఉంది.

Andhra Pradesh MLC Election 2023 : ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు

కాగా..ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో వైసీపీ అప్రమత్తమైంది. ముందే నేతల్ని హెచ్చరించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భంగపడితే పరువు పోతుందని భావిస్తోంది. దీంతో తన నేతలకు ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యే నిరసన గళాన్ని ధైర్యంగా వినిపించారు. కానీ మరికొంతమంది వాయిస్ రేజ్  చేయలేక ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తారని భావనతో ముందే హెచ్చరికలు జారీ చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. వైసీపీలో ఉన్న ఈ పరిస్థితిని తమకు అనుగుణంగా మార్చుకోవటానికి టీడీపీ యత్నాలు చేసి ఉండచ్చనే ఆలోచనతో వైసీపీ తమ నేతలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన వారిని మినహాయిస్తే టీడీపీ అభ్యర్ధి గెలుపుకు మరో ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీలో అసంతృప్తులు టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నవారు తమను గెలిపిస్తారని టీడీపీ ఆశలు పెట్టుకుంది.

Andhra Pradesh MLC Election 2023 : ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ‘టీడీపీ గెలిచినా’అంటూ వైసీపీ నేత తోట సంచలన వ్యాఖ్యలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ.. అదే జోరుతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని భావిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి సభలో 154 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ నుంచి సొంతంగా గెలిచిన 151మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఆ పార్టీకి ఎదురు తిరిగారు. వీరిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం వీరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసిందని కోటంరెడ్డి, ఆనం ఆరోపించారు. కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు చేయటమే కాదు తాను పార్టీలో కొనసాగేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో కోటంరెడ్డి ఓటు టీడీపీకి పడి ఉండవచ్చని భావిస్తున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి ఆత్మ సాక్షిగా ఓటేస్తామని ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ సొంతంగా 149మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురిని వైసీపీ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఒక్కో అభ్యర్థి గెలుపుకి 22మంది ఎమ్మెల్యేల బలం అవసరమవుతుంది. మొత్తం 154మంది ఎమ్మెల్యేల ఓట్లు వైసీపీకి అవసరం అవుతాయి.

Andhra Pradesh MLC Election 2023 : ఏపీలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఇలా పలువురు వైసీపీ వైపే ఉన్నా ప్రస్తుతం ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు టీడీపీకి సొంతంగా 19మందితో పాటు నెల్లూరు నుంచి కోటంరెడ్డి, ఆనం కూడా మద్దతిస్తున్నారు. గెలుపు కోసం మరొక్క ఓటు ఉంటే టీడీపీ సులువుగా గట్టెక్కుతుంది. టీడీపీ నుంచి నలుగురిలో ముగ్గురు లేకుంటే వైసీపీ అంతృప్త ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే అనురాధ ఎమ్మెల్సీగా గెలిచే అవకాశముంటుంది. ఇలా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ఉత్కంఠ వీడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

కాగా.. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా? లేదా టీడీపీ గెలుస్తుందా? అనే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవటం పెద్ద విషయం కాదని అంటూనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా పెద్ద విషయం ఏమీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ వైసీపీ మాత్రం తమ అభ్యర్ధులే గెలిచి తీరుతారని ధీమా వ్యక్తంచేస్తుంటే తోట మాత్రం ‘టీడీపీ గెలిచినా’ అంటూ వ్యాఖ్యానించటం పట్ల ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుపు ఖాయమా? అన్నట్లుగా ఉన్నాయి.