Andhra Pradesh MLC Election 2023 : ఏపీలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక విజయం ఎవరితో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. టీడీపీ, వైసీపీకి చెందిన 175మంది ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోవటంతో ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో 100శాతం ఓటింగ్ జరిగినట్లైంది.

Andhra Pradesh MLC Election 2023 :  ఏపీలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

Andhra Pradesh MLC Election 2023

Andhra Pradesh MLC Election 2023 : ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక విజయం ఎవరితో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. టీడీపీ, వైసీపీకి చెందిన 175మంది ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోవటంతో ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో 100శాతం ఓటింగ్ జరిగినట్లైంది. కాగా వైసీపీ ఎమ్మెల్యే నెల్లిమర్ల అప్పలనాయుడు కుమార్తె వివాహం ఉండటంతో ఓటు వేయటానికి ఆలస్యంగా రావటం..ఎట్టకేలకు ఓటు వేయటంతో పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతోంది. దీంతో గెలుపుపై టీడీపీ, వైసీపీ నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అప్పలనాయుడు కూతురు వివాహం అనంతరం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి విజయవాడకు వచ్చి వైసీపీ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పలనాయుడు కోసం వైసీపీ చాపర్‌ను పంపించింది. విశాఖ నుంచి గన్నవరం వరకు చేరుకున్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీకి రోడ్డు దారిన చేరుకుని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు కౌంటిగ్ ప్రక్రియ మొదలు కానుంది.

Andhra Pradesh MLC Election 2023 : ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ‘టీడీపీ గెలిచినా’అంటూ వైసీపీ నేత తోట సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంద్రబాబుతో పాటు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలవీరాంజనేయస్వామి, నిమ్మలరామానాయుడు, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇలా తెలుగు దేశంకు చెందిన ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

కాగా టీడీపీకి వారి ఎమ్మెల్యేలతో పాటు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా టీడీపీ అభ్యర్థులకే ఓటు వేస్తారనే ధీమాతో టీడీపీ ఉంది. ముఖ్యంగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటుతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి ఓటు కూడా టీడీపీకే పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వీరిద్దరి ఫోన్లను ట్రాప్ చేశారనే వార్తలు వచ్చిన క్రమంలో కోటంరెడ్డి, ఆనం పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరితో పాటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు (పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారు)కూడా టీడీపీకే ఓటు వేస్తారనే ప్రచారం జరుగటంతో వైసీపీపై ప్రజల్లోనే కాక సొంతపార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.