Andhra Pradesh MLC Election 2023 : ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లో జోరుగా సాగుతున్నాయి.

Andhra Pradesh MLC Election 2023 : ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు

P MLA Kota MLC Election

Andhra Pradesh MLC Election 2023 : ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లో జోరుగా సాగుతున్నాయి. పందాలు కాసేవారు సామాన్యప్రజలే కాదు ప్రజాప్రతినిథులు కూడా ఉండటం విశేషం. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు లక్షల్లో పందాలు కాస్తు హల్ చల్ చేస్తున్నారు. ఏడు స్థానాలు వైసీయే గెలుస్తుందని పొలిటికల్ బెట్టింగ్ లతో ఆంధ్రప్రదేశ్ లో ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్సీలు గెలుస్తుంది? అనే అంశంపై బెట్టింగ్ ల హవా నడుస్తోంది. దీంతో ఫలితాల కోసం బెట్టింగ్ రాయుళ్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

టీడీపీ,వైసీపీకి చెందిన 175మంది ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.దీంతో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేశారని కొంతమంది భావిస్తుంటే..కాదు కాదు వైసీపీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఓటు మాత్రం టీడీపీకి పడి ఉండవచ్చనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఒక్క ఓటు ఎవరిదో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది అని బాహాటంగానే చెప్పుకుంటున్నారు నేతలు.

Andhra Pradesh MLC Election 2023 : ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ‘టీడీపీ గెలిచినా’అంటూ వైసీపీ నేత తోట సంచలన వ్యాఖ్యలు

ఎందుకంటే ఇటీవల తన ఫోన్ ట్యాంపింగ్ చేశారనే ఆరోపణలు చేస్తూ మీడియా ముందు కోటంరెడ్డి వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వెళ్లగ్రక్కారు. దీంతో కోటంరెడ్డిని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాజాగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలల్లో కూడా కోటంరెడ్డి తన నియోజకవర్గం సమస్యల గురించి మాట్లాడుతుండగా స్పీకర్ సమయం ఇవ్వలేదని కోటంరెడ్డి ఆరోపించారు. కోటంరెడ్డిని స్పీకర్ ఈ సీజన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. దీంతో కోటంరెడ్డి ఓటు టీడీపీకి పడిందని భావిస్తున్నారు పలువురు. దీంతో అభ్యర్థుల విజయాన్ని సాధించుకోవటంలో టీడీపీయా? లేదా వైసీపీనా? అనేది కీలకంగా మారింది.

కాగా టీడీపీకి వారి ఎమ్మెల్యేలతో పాటు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా టీడీపీ అభ్యర్థులకే ఓటు వేస్తారనే ధీమాతో ఉంది. ముఖ్యంగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటుతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి ఓటు కూడా టీడీపీకే పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వీరిద్దరి ఫోన్లను ట్రాప్ చేశారనే వార్తలు వచ్చిన క్రమంలో కోటంరెడ్డి, ఆనం పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరితో పాటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు (పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారు)కూడా టీడీపీకే ఓటు వేస్తారనే ప్రచారం జరుగటంతో వైసీపీపై ప్రజల్లోనే కాక సొంతపార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Andhra Pradesh MLC Election 2023 : ఏపీలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..