Pawan kalyan : గుంటూరు జిల్లాలో జనసేన ఆవిర్భావ సభ..ఫ్లెక్లీలు, బ్యానర్లు తొలగింపు వివాదం
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిన్న క్రమంలో జనసేన ఫ్లెక్సీలను కొంతమందితొలగించారు

Pawan Kalyan Janasena Party
Pawan kalyan Janasena party : జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామంలో నిర్వహిన్న క్రమంలో జనసేన ఫ్లెక్సీలను కొంతమంది తొలగించారు. జనసేన సభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు,బ్యానర్లు ఏర్పాటు చేయగా వాటిని కొంమంది తొలగించారు.దీనిపై వివాదం కొనసాగుతోంది. పోలీసులు కావాలనే తమ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలనుతొలగించారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఇప్పటికే జనసేనకు ఏపీ పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభా వేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తున్న ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విజయవాడ కనకదుర్గ వారధిపై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read : Delhi : డీసీపీ కారును ఢీకొట్టిన పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్..
అక్కడ పెట్టిన జనసేన ఫ్లెక్సీలను పోలీసులే స్వయంగా తొలగిస్తున్నారని..దాన్ని తాను స్వయంగా చూశానని ఆయన అంటున్నారు. ఆ ఘటన చూసిన నాదెండ్ల కారులోంచి దిగి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అధికార వైసీపీ నేతల ఒత్తిడి వల్లే తమ పార్టీ ఫ్లెక్సీలను పోలీసులు తొలగిస్తున్నారని ఆరోపించారు. కానీ ఫ్లెక్సీలు తీసింది తాము కాదంటున్నారు పోలీసులు.
నాదెండ్ల మనోహర్ అక్కడ నుంచి వెళ్లిపోవాలని ట్రాఫిక్ ఉల్లంఘన జరుగుతుందని పోలీసులు సూచించారు.దీంతో పోలీసులపై నాదెండ్ల మనోహర్ మరింత మండిపడ్డారు. ఇక్కడ ట్రాఫికే లేకపోతే ట్రాఫిక్ ఉల్లంఘన ఎలా జరుగుతుందంటూ నిలదీశారు. వైసీపీ నేతల ఫ్లెక్సీలు కడితే కూడా ఇలాగే తొలగిస్తారా? అంటూ జనసేన నేతలు పోలీసులను ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో పోలీసులు ఏమీ చెప్పలేక ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ సూచించారు.
Also read : Peacocks Died: పంటపొలంలో విషం తిని 12 నెమళ్ళు మృతి.. రైతు అరెస్ట్
జనసేన ఆవిర్భావ సభ వద్దకు వెళ్లే దారుల్లో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రేపటి సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.