Varahi Vijaya Yatra: పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఇదే..

మొదటి విడత వారాహి యాత్ర సక్సెస్ కావడంతో రెండో విడతపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.

Varahi Vijaya Yatra: పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఇదే..

Pawan kalyan varahi vijaya yatra

Varahi Vijaya Yatra – Eluru: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి విజయ యాత్ర రెండో విడత (second phase) షెడ్యూల్ ఖరారైంది. మొదటి విడతలో అన్నవరం (Annavaram) నుంచి భీమవరం (Bhimavaram) వరకు వారాహి విజయ యాత్ర నిర్వహించారు. తాజాగా ఏలూరు (Eluru), తాడేపల్లిగూడెం (Tadepalligudem) నియోజకవర్గాల్లో పర్యటించేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. రెండో విడత వారాహి యాత్రపై పవన్ కల్యాణ్ శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. తొలి విడత వారాహి యాత్ర సక్సెస్ కావడంతో రెండో విడతపై చర్చించారు.

రేపు ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్రను జనసేనాని ప్రారంభించనున్నారు. రేపటి ఏలూరు సభ ఏర్పాట్లు, యాత్ర వివరాలపై పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ చర్చించారు. మరోవైపు తమ నాయకుడి పర్యటనతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్పాహంగా ఉన్నారు. రెండో విడత వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడత యాత్రలో అధికార పార్టీ నాయకులు, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రెండో విడతలోనూ అదే పంథా కొనసాగించనున్నారని సమాచారం.

పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర 4 రోజుల షెడ్యూల్
09-07-2023 : మధ్యాహ్నం ఏలూరు మిని బైపాస్ లోని క్రాంతి కల్యాణ మండపానికి జనసేనాని చేరుకొంటారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభలో పాల్గొంటారు.

10-07-2023 : మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు మినీ బైపాస్ లోని క్రాంతి కళ్యాణ మండపంలో జనవాణి నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతారు.

11-07-2023 : క్రాంతి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, వీర మహిళలతో పవన్ సమావేశవుతారు. సాయంత్రం 5 గంటలకు రోడ్డు‌ మార్గం ద్వారా తాడేపల్లిగూడెం చేరుకుంటారు.

12-07-2023 : బుధవారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు.

Also Read: చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని పవన్ కల్యాణ్ ఎందుకు సమర్థిస్తున్నాడు?: మంత్రి కొట్టు సత్యనారాయణ

ఏలూరులో భారీ ఏర్పాట్లు
రేపు ఉదయం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారులను జనసేన ప్లెక్సీలు, జెండాలతో నింపేశారు. మార్పు మొదలైంది అంటూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.