Payyavula Keshav: అది తిట్టు కాదు.. ఇంకో అర్థం కూడా ఉందంటున్న టీడీపీ ఎమ్మెల్యే..!

TDP నేత పట్టాభి చేసిన కామెంట్లకు.. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన అర్థాన్ని వెదుక్కుంటున్నారని టీడీపీ నేత పయ్యావుల ఆరోపించారు. ఆ పదానికి గుజరాత్ లో మరో అర్థం కూడా ఉందని చెప్పారు.

Payyavula Keshav: అది తిట్టు కాదు.. ఇంకో అర్థం కూడా ఉందంటున్న టీడీపీ ఎమ్మెల్యే..!

Payyavula

Updated On : October 21, 2021 / 12:19 PM IST

Payyavula Keshav:ఏపీ సీఎం జగన్ పై.. టీడీపీ నేత పట్టాభి చేసిన కామెంట్లు.. రాష్ట్రంలో రాజకీయ రచ్చను సృష్టించాయి. పట్టాభి వాడింది బూతు మాట అని ముఖ్యమంత్రి జగన్ సహా.. వైసీపీ నేతలంతా టీడీపీని టార్గెట్ ను చేస్తున్నారు. కొందరు కార్యకర్తలైతే ఏకంగా టీడీపీ కార్యాలయంపైకి దండెత్తారు. చివరికి.. ఆ ఎపిసోడ్ అంతా.. చంద్రబాబు దీక్ష వరకు వెళ్లింది.

తాజాగా.. ఈ కామెంట్ల వార్ లో.. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల ఎంటరయ్యారు. పట్టాభి చేసిన కామెంట్ కు.. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన అర్థాన్ని వెదుక్కుంటున్నారని ఆరోపించారు. బోష్ డీకే అని గుజరాత్ లో ఓ గ్రామం ఉందని.. ఆ పదానికి అమాయకులు అని కూడా అర్థం ఉందని పయ్యావుల స్పష్టం చేశారు. అలాగే.. తమ కార్యాలయంపై దాడి చేసిన వారిలో సుమారు 10 మంది పోలీసులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.

దాడిపై కోర్టుకూ వెళ్తామని స్పష్టం చేశారు. తమపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని.. వాటికి భయపడేది లేదని పయ్యావుల చెప్పారు. బాస్ ఆఫ్ ద పోలీస్ నుంచే తప్పులు జరుగుతున్నాయంటూ.. కొందరు పోలీసులు చెబుతున్నారని కామెంట్ చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసులు అంతర్మథనం చెందుతున్నారని అన్నారు. తమ బాస్ ఇచ్చే తప్పుడు ఆదేశాలు అమలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

తమ పోరాటం డ్రగ్స్ మీద అని చెప్పిన పయ్యావుల.. చేతనైతే వైసీపీ నేతలూ ఆ పోరాటంలో భాగం కావాలని చెప్పారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయి నివారణ విషయంలో తీసుకున్న చర్యలను.. ఏపీ సీఎం కూడా అమలు చేస్తే స్వాగతిస్తామని అన్నారు.

Read More:

CM Jagan on TDP: సీఎం జగన్ సీరియస్.. ఆ విషయంలో పోలీసులు ఎవర్నీ వదలొద్దన్న సీఎం!

Chandrababu Protest: దాడి జరిగిన చోటే చంద్రబాబు దీక్ష ప్రారంభం.. ఎవరినీ వదిలేది లేదన్న అచ్చెన్న..!