PM Modi Visakhapatnam : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్

ప్రధాని మోదీ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఐఎఎన్ ఎస్ డేగ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.

PM Modi Visakhapatnam : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్

PM Modi Visakhapatnam : ప్రధాని మోదీ విశాఖ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి విశాఖ ఐఎన్ఎస్ డేగ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. మారుతీ జంక్షన్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభం కానుంది. ఇక ప్రధానితో భేటీ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఐఎన్ఎస్ చోళకు వెళ్లారు.

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. వర్షం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం మధురై నుంచి విశాఖకు ఆలస్యంగా చేరుకుంది. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోదీ ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు. తూర్పుతీర నౌకాదళ స్థావరంలో ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.

విశాఖపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి తూర్పుతీర నగరానికి చేరుకున్నారు. విశాఖలోని మారుతి జంక్షన్ లో ప్రధాని మోదీ ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో కోసం బీజేపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఈ రాత్రి పవన్ కంటే ముందే ఏపీ బీజేపీ నేతలు ప్రధాని మోదీని కలవనున్నారు. రాత్రి 8.30 గంటలకు పవన్.. మోదీతో సమావేశం అవుతారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోకు పయనమయ్యారు. అటు, జనసేనాని పవన్ కల్యాణ్ హోటల్ నోవోటెల్ నుంచి ప్రధాని మోదీతో సమావేశం కోసం చోళ సూట్ కు బయల్దేరారు.

విశాఖలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభలో ఎనిమిది మందికే అనుమతించారు. ప్రధానితో పాటు వేదికపై గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, పీవీఎన్ మాధవ్ మాత్రమే ఉంటారు.

ఈ సభలో ప్రధాని మోదీ 40 నిమిషాల పాటు, ఏపీ సీఎం జగన్ 7 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహిస్తారు.