Visakha Ganja : అమెజాన్‌లో విశాఖ గంజాయి స్మగ్లింగ్

అమెజాన్‌ పార్సిల్స్ కు గంజాయి ఎక్కడ నుంచి వస్తుందనే దానిపై విచారణ కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్‌పై 2007లో గంజాయి కేసు ఉంది.

Visakha Ganja : అమెజాన్‌లో విశాఖ గంజాయి స్మగ్లింగ్

Amazon

Updated On : November 27, 2021 / 3:26 PM IST

Ganja Using Amazon : అమెజాన్‌ లో గంజాయి పార్సిల్స్ చేస్తున్న కేసులో విశాఖ పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కేంద్రంగా ఆర్డర్లు పెడితే.. కంచరపాలెం నుంచి పార్సిల్స్‌ వెళ్లేవి. గ్వాలియర్‌లో ఇద్దరి అరెస్టుతో ఆన్‌లైన్ గంజాయి దందా వెలుగుచూసింది. ఆరేడు నెలలుగా గంజాయి పార్సిల్స్‌ అమెజాన్‌లో వెళ్లినట్లు గుర్తించామన్నారు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్ మెంట్‌ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌ సతీష్‌కుమార్. సూపర్ నేచురల్‌ స్టీవియా లీవ్స్‌ పేరుతో అమెజాన్‌లో సెల్లర్‌గా రిజిస్టర్‌ అయిన జేస్వల్, భవయ్య…విశాఖకు చెందిన చిలకపర్తి శ్రీనివాసరావు స్టాక్‌ పాయింట్‌ ఇచ్చారు.

Read More : Komatireddy : దటీజ్ కాంగ్రెస్..ఒకే వేదికపై రేవంత్ – కోమటిరెడ్డి..సరదాగా మాట్లాడుకున్నారు

జేస్వల్‌, భవయ్యను మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా..విశాఖకు చెందిన చిలకపర్తి శ్రీనివాసరావు తమకు గంజాయి పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 21న వాహనాలు తనిఖీలు చేస్తుండగా శ్రీనివాస్‌ పట్టుబడ్డాక… మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇచ్చిన సమాచారంతో అతని ఇంట్లో పోలీసులు తనిఖీలు చేస్తే అమెజాన్ ప్యాకింగ్‌ సామాగ్రితో పాటు గంజాయి లభించింది. ఈ కేసులో శ్రీనివాస్‌తో పాటు విశాఖకు చెందిన అమెజాన్‌ పార్సిల్స్ పికప్ బాయ్స్‌ కుమారస్వామి, కృష్ణంరాజు, డ్రైవర్‌ వెంకటేశ్వరరావును ఇప్పటికే అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శ్రీనివాస్‌ తనయుడు మోహన్‌రాజును కూడా అరెస్ట్‌ చేసింది స్పెషల్‌ ఎన్‌ఫోర్స్ మెంట్‌ బ్యూరో.

Read More : Undavalli : అసెంబ్లీలో ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందా ? – ఉండవల్లి

అమెజాన్‌ పార్సిల్స్ కు గంజాయి ఎక్కడ నుంచి వస్తుందనే దానిపై విచారణ కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్‌పై 2007లో గంజాయి కేసు ఉంది. ఇప్పటివరకు ఆరు వందల నుంచి ఏడు వందల కేజీల గంజాయిని స్మగ్లింగ్ చేసిందని తెలుస్తోంది. ఈ కేసులో అమెజాన్‌ సంస్థకు నోటీసులు ఇచ్చారు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్ మెంట్‌ బ్యూరో పోలీసులు. మెటీరియల్ చెక్‌ చేయకుండా పార్సిల్‌ తీసుకోవడంపై వివరణ కోరతామన్నారు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్ మెంట్‌ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌.