తిరుపతిలోని అలిపిరి కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి పాజిటివ్

  • Published By: bheemraj ,Published On : July 15, 2020 / 05:53 PM IST
తిరుపతిలోని అలిపిరి కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి పాజిటివ్

తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కరోనా కలకలం రేగింది. అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన కరోనా శిబిరంలో పని చేస్తున్న ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. దీంతో శిబిరాన్ని తాత్కాలికంగా తొలగించారు. టీటీడీ ఉద్యోగులు, యాత్రికుల కరోనా పరీక్షలకు బ్రేక్ పడింది.

అలిపిరి వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్వాప్స్ కలెక్షన్ సెంటర్ మూత పడింది. స్వాప్స్ కలెక్షన్ సెంటర్ లో పని చేసే ఇద్దరి సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఈ సెంటర్ ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ సెంటర్ ను ప్రారంభించి కేవలం మూడు వారాలు అవుతుంది. స్వయంగా టీటీడీ ఈవో, ఇతర అధికారులు ఈ సెంటర్ ను ప్రారంభించారు.

ప్రధానంగా మొదట దీన్ని అవగాహన శిబిరంగా ప్రారంభించి తర్వాత స్వాప్ కలెక్షన్ సెంటర్ గా మార్చారు. ర్యాండమ్ గా వంద మంది యాత్రికులను సెలెక్ట్ చేసి వారి నుంచి స్వాప్స్ కలెక్ట్ చేసి రుయాకు స్విమ్స్ గానీ పంపి పరీక్షలు చేసే విధంగా మొదటగా ఈ సెంటర్ ను తీర్చిదిద్దారు. అయితే టీటీడీ ఉద్యోగులు కూడా కరోనా బారిన పడటంతో ఉద్యోగులందరికీ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని టీటీడీ ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక రోజుకు వంద మంది ఉద్యోగుల చొప్పున వరుసుగా టీటీడీలో ఉన్న 15000 మంది శాశ్వత ఉద్యోగులకు జరపాలని నిర్ణయించారు.

వారం రోజులపాటు టీటీడీ ఉద్యోగుల నుంచి స్వాప్స్ కలెక్షన్ కార్యక్రమం నిరంతరంగా కొనసాగింది. అంతకముందు నెల రోజులుగా యాత్రికుల స్వాప్స్ కలెక్షన్ చేసే కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమం నిరవధికంగా కొనసాగుతున్న క్రమంలో ఒక్కసారిగా స్వాప్స్ సెంటర్ లో పని చేస్తున్న ఇద్దరి సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ స్వాప్స్ కలెక్షన్ సెంటర్ ను తాత్కాలికంగా మూసివేశారు.

అలిపిరి కేంద్రానికి మధ్యలో ప్రత్యేక శిబిరంలో ఈ స్వాప్స్ ఉండేంది. కానీ దీన్ని పర్మినెంట్ సెటప్ గా దగ్గర్లోని మరో ప్రాంతానికి తరలించారు. శిబిరంలో పని చేసే ఇద్దరి సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ సెంటర్ ను మూసివేశారు. దీంతో టీటీడీ ఉద్యోగులు, యాత్రికులకు స్వాప్స్ కలెక్షన్స్ ఆగిపోయాయి.