Purandeswari : ఎక్కడికీ పోదు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్లదని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండ

Purandeswari : ఎక్కడికీ పోదు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari

Purandeswari : విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్లదని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూస్తామన్నారు. అలాగే వారికి మెరుగైన ప్యాకేజీ దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. ”మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి. మౌలిక సదుపాయాలకు వనరులు అవసరం. ఐదు రంగాల్లో నిరర్ధక ఆస్తులను వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. అలాంటి నిరుపయోగ ఆస్తులు వినియోగించుకోవడం మేం సమ్మతిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు. ఉద్యోగులకు ప్యాకేజీ ఇవ్వడం, వారిని ఆదుకునే అంశంపై ఆలోచిస్తాం. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలి” అని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై పదాధికారుల సమావేశంలో చర్చించుకున్నామని పురంధేశ్వరి తెలిపారు.

ఏపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీని గెలిపిస్తే.. రెండున్నర ఏళ్లలో వారికి ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు. మోసం, అవినీతి పెరిగిపోయిందన్నారు. కక్షపూరితంగా పాలిస్తున్నారని విమర్శించారు. ప్రజావేదికను కూల్చడంతో విధ్వంస పాలన మొదలైందని, దేవుని రథాలు తగులబెట్టేంత వరకూ వెళ్లిందని అన్నారు. ప్రతిపక్షాలపై కక్షసాధింపు ఎక్కువైందని పురంధేశ్వరి మండిపడ్డారు.

Celebrities Costly Bikes: ఎంఎస్ ధోనీ నుంచి మాధవన్ వరకూ సెలబ్రిటీలు లక్షలు పోసి కొనుక్కున్న బైక్‌లివే..

టీడీపీపైనా విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని టీడీపీని గెలిపిస్తే… న్యాయం జరగాల్సింది పోయి జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని అన్నారు.

”పాదయాత్ర చేసి ప్రజలకు మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వారు ఏమీ చేయలేదు. ఈ రెండున్నర సంవత్సరాలు పరిశీలిస్తే న్యాయం జరిగిందా అని అనుమానం కలుగుతుంది. మోసం, అవినీతి జరిగింది. విధ్వంసకర, కక్షపూరిత అంశాలే జరిగాయి. ఆలయాల్లో విగ్రహాల కూల్చివేత, విధ్వంసం కొనసాగింది. బీజేపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.

జాతీయ మీడియా సైతం రాష్ట్ర గౌరవానికి భంగం కలుగుతోందని చెబుతోంది. రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారింది. ఒక పక్క ప్రజలకు పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారు. మరో వైపు లాగేస్తున్నారు. అమ్మఒడి పేరిట రూ.15 వేలు ఇస్తున్నారు. మరోవైపు మద్యం రూపంలో లాగేస్తున్నారు. ఆటో వారికి రూ.10 వేలు ఇస్తున్నారు. విపరీతమైన చలాన్లతో లాక్కుంటున్నారు.

Tambulam : భోజనం తరువాత తాంబూలం వేసుకోవటం మంచిదేనా!..

మద్యం విక్రయాల్లో ఈ రోజు వరకు డిజిటల్ లావాదేవీలు ప్రవేశ పెట్టలేదు. ఇసుకను బంగారంలా మార్చేశారు. ఇసుక ధర పెరగడం వల్ల ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. వారి ఇచ్చే పన్నులతో ప్రభుత్వానికి ఆదాయం రావాలి. కానీ అలా జరగడం లేదు. ఏపీ ప్రజలు రెండుసార్లు మోసపోయారు” అని పురంధేశ్వరి అన్నారు.

‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ పెట్టుబడి ఉపసంహరించాలని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ ఉపసంఘం నిర్ణయించింది. పెట్టుబడి ఉప సంహరణతో నిర్వహణ, సాంకేతికత, సామర్థ్యం పెరుగుతాయి. అధిక ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయి. ఉద్యోగులు, సిబ్బంది, వాటాదారులను పరిగణనలోకి తీసుకున్నాం. అన్నీ పూర్తయ్యాక షేర్‌ పర్చేజ్‌ ఒప్పందం జరుగుతుంది’’ అని ఇటీవలే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఆర్‌.పి.సింగ్‌ చెప్పారు.