Ramagundam : ఆయుధాలు అమ్ముతాం, హత్యలు, కిడ్నాప్‌‌లు చేసి పెడుతాం

ఆయుధాలు అమ్ముతాం, హత్యలు, కిడ్నాప్‌‌లు చేసి పెడుతాం అంటూ..యూ ట్యూబ్ లో వెల్లడించడం..దీనిని చూసిన ఓ వ్యక్తి అతడిని సంప్రదించడం...ఇద్దరు మహిళలను దారుణంగా...చంపేశాడు. జంట హత్యల కేసులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.

Ramagundam : ఆయుధాలు అమ్ముతాం, హత్యలు, కిడ్నాప్‌‌లు చేసి పెడుతాం

Ramagundam

Mancherial Double Murder Case : ఆయుధాలు అమ్ముతాం, హత్యలు, కిడ్నాప్‌‌లు చేసి పెడుతాం అంటూ..యూ ట్యూబ్ లో వెల్లడించడం..దీనిని చూసిన ఓ వ్యక్తి అతడిని సంప్రదించడం…ఇద్దరు మహిళలను దారుణంగా…చంపేశాడు. జంట హత్యల కేసులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. స్థానిక డీసీపీ కార్యాలయంలో మంగళవారం రామగుండ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.

మంచిర్యాల బృందావనం కాలనీలో తల్లి పూదరి విజయలక్ష్మీ, కుమార్తె రవీనా నివాసం ఉంటున్నారు. నిజామాబాద్ బోధన్ కు చెందిన అరుణ్ కుమార్, రవీనాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం జూన్ లో వీరి వివాహం జరిగింది. అయితే..కట్నం తీసుకరావలంటూ రవీనాను అరుణ్ వేధించసాగాడు. దీంతో ఈమె పుట్టింటికి వచ్చేసింది. అప్పటికీ రవీనా గర్భవతి. తల్లి విజయలక్ష్మీ అబార్షన్ చేయించింది. దీంతో అతను ఇద్దరిపై అరుణ్ పై పగ పెంచుకున్నాడు.

అలవాటు ప్రకారం ఓ సారి అరుణ్ యూ ట్యూబ్ చూశాడు. అందులో సుపారీ కిల్లర్ విజయవాడ ఐడీ కనిపించింది. ఆయుధాలు అమ్ముతాం..సుఫారీ తీసుకుని హత్యలు, కిడ్నాప్ లు చేస్తామని ఉంది. ఈ నెంబర్ (ఇంటర్నేషనల్) నంబర్ ఇచ్చి..వాట్సాప్ లో సంప్రదించవచ్చని ఉంది. దీంతో అరుణ్ అతడిని సంప్రదించింది. బిట్టు గా పరిచయం చేసుకున్నాడు. హత్యలు చేయాలంటే..రూ. 10 లక్షలు అవుతుందని చెప్పాడు. అంత డబ్బు తన దగ్గర లేదని..తన అత్తారింట్లో ఎప్పుడూ రూ. 4 లక్షలు, బంగారు నగలు ఉంటాయని వెల్లడించాడు.

తెనాలికి చెందిన సుబ్బుతో కలిసి 2021, జూన్ 17వ తేదీన మంచిర్యాలకు చేరుకున్నారు. అరుణ్ వారిని కలుసుకున్నాడు. 2021, జూన్ 18వ తేదీ ఉదయం మూడు గంటలకు ఇంటి గోడ దూకి మేడపైకి వెళ్లి..మాటు వేశారు. ఉదయం 5 గంటల సమయంలో..నీళ్ల కోసం బయటకు వచ్చిన విజయలక్ష్మీ ముగ్గురు దాడి చేసి ఆమె మెడను తాడుతో బిగించి చంపేశారు. శబ్దంతో నిద్ర లేచి రవీనాను ఇదే తరహాలో చంపేశారు. తర్వాత..వారి శరీరంపై నగలు లాగేసుకున్నారు. మంచిర్యాల పోలీసులు ఈనెల 28వ తేదీన అరుణ్, అతడిచ్చిన సమాచారంతో విజయవాడకు వెళ్లి..బిట్టు, సుబ్బులను మంగళవారం అరెస్టు చేశారు.

బిట్టు ఎవరు ?
గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన బుజ్జవరపు రోషయ్య..అలియాస్ బిట్టు డిగ్రీ పూర్తి చేశాడు. ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని…విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. యూ ట్యూబ్ లో ఆయుధాలు అమ్ముతామనే ఓ సందేశాన్ని చూశాడు. రూ. 30వేలకు గన్ కొనేందుకు ఒకరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ వ్యక్తి డబ్బులు తీసుకుని గన్ ఫర్ సేల్..అంటూ..తన ఫోన్ నెంబర్ పెట్టేవాడు. సుపారీ కిల్లర్ విజయవాడ…అనే ఐడీని రూపొందించి…ఆయుధాలు అమ్ముతామని, అవసరమైతే…సుఫారీ తీసుకుని..హత్యలు, కిడ్నాప్ లు కూడా చేస్తామని ప్రకటించాడు.