AP Fishing: మత్య్సకారులు వలలో అరుదైన చేపలు.. ఒక్కొకటి రూ.లక్ష!

మన విశాల సముద్రంలో మనకి తెలిసినవి.. ఎప్పుడూ దొరికేవే కాదు.. కొన్ని అరుదైన చేపలు కూడా ఉన్నాయి. అవి సముద్రం నుండి నదులకు కూడా వస్తుంటాయి.

AP Fishing: మత్య్సకారులు వలలో అరుదైన చేపలు.. ఒక్కొకటి రూ.లక్ష!

Ap Fishing

AP Fishing: మన విశాల సముద్రంలో మనకి తెలిసినవి.. ఎప్పుడూ దొరికేవే కాదు.. కొన్ని అరుదైన చేపలు కూడా ఉన్నాయి. అవి సముద్రం నుండి నదులకు కూడా వస్తుంటాయి. అప్పుడప్పుడు మత్సకారుల వలలకు కూడా చిక్కుతుంటాయి. ప్రతి ఏడాది ఈ సమయానికి అరుదైన పులస చేపలు దొరికుతుండగా ఈ ఏడాది కూడా పులస చేపలకు భారీ ధరలు పలికింది. నాలుగు రోజుల క్రితమే యానాంలో రెండు కిలోల పైన పులస చేప దొరకగా.. రూ.20 వేల పైన ధర పలికింది.

కాగా, ఇప్పుడు అలానే తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుడి వలకు రెండు అరుదైన జంట చేపలు చిక్కాయి. సఖినేటిపల్లి అంతర్వేది మినీఫిషింగ్‌ హార్బర్‌‌ నుండి వేటకు వెళ్లిన ఓ మత్య్సకారుడి వలకు రెండు అతిపెద్ద చేపలు పడ్డాయి. బయటకొచ్చి చూస్తే అవి అరుదైన కచిడీ చేపలుగా గుర్తించారు. వలకు చిక్కిన రెండు చేపలలో మగ చేపను తూకం వేస్తే ఏకంగా 16కిలోల ఉండగా మరొ ఆడచేప 15 కేజీలు ఉంది.

ఈ చేపలలో మగ చేపను ఓ వ్యాపారి రూ.లక్షకు పైగా ధర చెల్లించి కొనుగోలు చేయగా ఆడచేపను లక్షలోపు ధరకు దక్కించుకున్నారు. ఈచేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారని మత్స్యశాఖ ఏడీ చెప్పగా.. ఈ చేప విలువలో 98 శాతం పొట్ట భాగమేనని.. ఈచేపను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని వ్యాపారి తెలిపారు.