YCP-BRS In AP : బీఆర్ఎస్‌కు వైసీపీ మద్దతు విషయంలో.. కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు వైసీపీ మద్దతు విషయంలో.. YCP నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీలకు వైసీపీ మద్దతు ఉుంటుంది అంటూ..

YCP-BRS In AP : బీఆర్ఎస్‌కు వైసీపీ మద్దతు విషయంలో.. కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

Regarding YCP's support to BRS.. Kodali Nani's interesting comments

BRS-YCP In AP : జాతీయ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తూ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీగా మారిన తరువాత తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలపై దృష్టి పెడతాం అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం కూడా తెలిసింది. దీంట్లో భాగంగానే ఏపీపై కూడా బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఏపీలో బీఆర్ఎస్ ప్ర‌భావం, తదితర అంశాలపై వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొడాలి నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతు ఇస్తుందా? అనే మీడియా ప్రశ్నలకు కొడాలి సమాధానం ఇస్తూ..జాతీయ పార్టీలకు వైసీపీ అంశాలవారీగానే మద్దతు ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదు అంటూనే అంశాలవారీగా మద్దతు ఉంటుంది అంటూ కొడాలి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతు ఇస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ విషయంపై కొడాలి మాట్లాడుతూ..ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండకపోవచ్చు అన్నారు. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు. అలాగే ఏపార్టీతోనూ వైసీపీకి పొత్తు ఉండదని కూడా అన్నారు. ఓపక్క జాతీయ పార్టీలకు మద్దతు ఉంటుందంటూనే మరోపక్క వైసీపీకి ఎవరి పొత్తు అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. కాగా ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే వైసీపీ మద్దతు ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే వైసీపీ మద్దతు ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ లో చేరేందుకు ఏపీలో కొంతమంది ఆసక్తి చూపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ IRTS అధికారి రావెల కిశోర్‌బాబుతో పాటు పలువురు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే సీఎం కేసీఆర్ త్వరలోనే ఏపీలో పర్యటించబోతున్నారని భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. ఏపీలో బహిరంగ సభ ఏర్పాటుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.