Reliance Jio 4G: రిలయన్స్ జియో 4G సేవలు.. ఎంపీ అవినాష్ చేతుల మీదుగా ప్రారంభం | Reliance Jio 4G Launched by MP Avinash

Reliance Jio 4G: రిలయన్స్ జియో 4G సేవలు.. ఎంపీ అవినాష్ చేతుల మీదుగా ప్రారంభం

రిలయన్స్ జియో తన 4G మొబైల్ నెట్‌వర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారిపల్లిలో ప్రారంభించింది.

Reliance Jio 4G: రిలయన్స్ జియో 4G సేవలు.. ఎంపీ అవినాష్ చేతుల మీదుగా ప్రారంభం

Reliance Jio 4G: రిలయన్స్ జియో తన 4G మొబైల్ నెట్‌వర్క్ సేవలను కడప జిల్లాలోని గిడ్డంగివారిపల్లిలో ప్రారంభించింది. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన జియో సెల్ టవర్‌ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు జియో అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వేంపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన గిడ్డంగివారి పల్లి చుట్టూ కొండలు ఉండటంతో ప్రజలు సరైన మౌలిక సదుపాయాలు, టెలికాం నెట్వర్క్ లేక ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న అనేక సంక్షేమ పథకాలను పొందడంలో ప్రజలు తీవ్ర అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడప ఎంపీ చొరవ చూపి సెల్ టవర్ ఏర్పాటుకు కృషి చేశారు.

ఎంపీ సూచన మేరకు జియో త్వరితగతిన సెల్ టవర్ పనులు పూర్తి చేసి గ్రామంలో హైస్పీడ్ 4G మొబైల్ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసింది. కొత్త సెల్ టవర్ ద్వారా జియో గ్రామ ప్రజలకు హై-స్పీడ్ 4G సేవలు అందిస్తోంది. ఫలితంగా విద్యార్థులు కూడా ఈ కరోనా సమయంలో బయటకు వెళ్ళకుండా చదువుకోవచ్చునని చెబుతున్నారు.

కరోనా కాలంలో ప్రజలు షాపింగ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, పాఠాలను నేర్చుకోవడం, వినోదం పొందడం, ఆర్థికంగా లావాదేవీలు చేసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ పరివర్తన కేవలం పట్టణాలకే పరిమితం కాలేదు, గ్రామీణ మార్కెట్లకు కూడా విస్తరించింది.

గతంలో 3G సేవలు ఎక్కువగా పట్టణ కేంద్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు 4G హైస్పీడ్ సేవలను కొన్ని వందల మంది జనాభా కలిగిన గ్రామాల్లో కూడా అందుబాటులోకి తెస్తున్నాయి.

దేశంతో పాటు మన రాష్ట్రం లో కూడా అతి పెద్ద 4G సర్వీస్ ప్రొవైడర్ అయిన జియో తన విస్తృతమైన నెట్‌వర్క్‌ను అందుబాటు ధరలో జియోఫోన్ సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో తన సేవలను అందిస్తోంది. దీంతో మారుమూల గ్రామాల్లోని కస్టమర్లు సైతం ఈ సేవలు, వాటి ప్రయోజనాలను పొందుతున్నారు.

×