Minister Roja: నలుగురు బహిష్కృత ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్

జగన్ వల్లే ఆ నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారని రోజా చెప్పారు. దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని రోజా సవాలు విసిరారు. కరోనా బారిన పడ్డప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవిని జగన్ కాపాడారని ఆమె చెప్పారు.

Minister Roja: నలుగురు బహిష్కృత ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్

Minister Roja

Minister Roja: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందించారు.

జగన్ వల్లే ఆ నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారని రోజా చెప్పారు. దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని రోజా సవాలు విసిరారు. కరోనా బారిన పడ్డప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవిని జగన్ కాపాడారని ఆమె చెప్పారు. ఇప్పుడు ప్రాణ హాని ఉందని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని తెలిపారు. హైదరాబాద్ లో ఉండే డాక్టర్ ని తీసుకొచ్చి, అమరావతిలో గెలిపిస్తే పార్టీకి ద్రోహం చేశారని చెప్పారు.

టీడీపీ నేతలు ఒక్క ఎమ్మెల్సీని గెలిపించుకుని ఏదో సాధించాలమనుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడివి నీచ రాజకీయాలని ఆమె అన్నారు. కాగా, తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని ఉండవల్లి శ్రీదేవి అంటున్నారు. ఆమె వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇవాళ స్పందించారు. ఆమె స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తనను అవమానించారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. శ్రీదేవికి ఆమె నియోజక వర్గంలో ఆదరణ లభించడం లేదని అన్నారు.
MLA Anil Kumar Yadav : మీరు మళ్లీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా- ఆ ముగ్గురికి ఎమ్మెల్యే అనిల్ సవాల్