TTD: టీటీడీ ట్రస్టులకు ఒకేరోజు రూ.10 కోట్ల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి. ఒకే రోజున టీటీడీ ట్రస్టులకు మొత్తం కలిపి రూ.10 కోట్లు విరాళం అందడం గమనార్హం. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు వివిధ ట్రస్ట్‌లకు రూ.7 కోట్లు విరాళం ఇచ్చారు.

Ttd Eo
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి. ఒకే రోజున టీటీడీ ట్రస్టులకు మొత్తం కలిపి రూ.10 కోట్లు విరాళం అందడం గమనార్హం. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు వివిధ ట్రస్ట్‌లకు రూ.7 కోట్లు విరాళం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో రికార్డు స్థాయిలో ఒకే రోజు వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ట్రస్ట్‌లకు రూ.10 కోట్లు విరాళాలు వచ్చాయని సంబంధిత అధికారులు తెలిపారు. తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి దాతలు అందుకు సంబంధించిన డీడీలను అందజేశారు.