Chandrababu : రూ. 500 నోట్లను కూడా రద్దు చేయాలి : చంద్రబాబు

ధన బలంతో జగన్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు అయితే ప్రజలకు సేవ చేసే పార్టీలే నిలుస్తాయి.. గెలుస్తాయని అన్నారు.

Chandrababu : రూ. 500 నోట్లను కూడా రద్దు చేయాలి : చంద్రబాబు

Chandrababu

Rs. 500 Notes Demonetization : రూ. 500 నోట్లను కూడా రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రూ. 500 నోట్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రూ. 500 నోట్ల రద్దుపై వైసీపీ సహా అన్ని పార్టీలు తన విధానం ప్రకటించాలన్నారు. జగన్ ఇప్పటికే నియోజకవర్గాలకు రూ. 2 వేల నోట్లతో కూడిన డబ్బులు పెద్ద ఎత్తున పంపాడటని పేర్కొన్నారు. ఈ మేరకు మహానాడులో చంద్రబాబు మాట్లాడారు.

ఇప్పుడు రూ. 2 వేల నోటు రద్దు చేయడంతో వాటిని రూ. 500గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారట అని అన్నారు. కాబట్టి రూ. 500 నోట్లను కూడా రద్దు చేస్తే శని వదిలిపోతుందన్నారు. ధన బలంతో జగన్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు అయితే ప్రజలకు సేవ చేసే పార్టీలే నిలుస్తాయి.. గెలుస్తాయని అన్నారు.

Rs.2000 denomination : అందుకే ప్రధాని విద్యావంతుడై ఉండాలనేది : రూ.2వేల నోట్ల రద్దుపై కేజ్రీవాల్ కేజ్రీ కామెంట్స్

మహానాడులో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో టీడీపీ కీలక అంశాలను ప్రస్తావించింది. వైసీపీ క్లాస్ వార్ వ్యూహానికి కౌంటరుగా టీడీపీ క్యాష్ వార్ సాగుతోంది. ఎన్నికల్లో డబ్బుల ప్రభావంతో వైసీపీ గెలిచే ప్రయత్నం చేస్తోందంటూ రాజకీయ తీర్మానంలో ప్రస్తావించింది. రూ. 2 వేల నోట్లతో పాటు రూ. 500 నోట్లను రద్దు చేయాలని రాజకీయ తీర్మానంలో టీడీపీ ప్రస్తావించింది.

ఒకటికి రెండు సార్లు జాతీయ రాజకీయాల్లో టీడీపీ పోషించిన పాత్రను రాజకీయ తీర్మానం గుర్తుకు తెచ్చింది. గతంలో తనను ప్రధానిగా ఉండమని ఒత్తిడి తెచ్చినా తెలుగు జాతే తనకు ముఖ్యమని స్పష్టం చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు తనకు తెలుగు జాతే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.