Sabarimala Temple: ఈ సీజన్ కు “శబరిమల ఆలయం” మూసివేత

కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప సన్నిధి ఈ సీజన్ కి గానూ మూతపడింది. "మండల-మకరవిళక్కు"గా పిలిచే ఈ కాలవ్యవధి గురువారంతో ముగిసింది.

Sabarimala Temple: ఈ సీజన్ కు “శబరిమల ఆలయం” మూసివేత

Ayyappa

Sabarimala Temple: కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప సన్నిధి ఈ సీజన్ కి గానూ మూతపడింది. “మండల-మకరవిళక్కు”గా పిలిచే ఈ కాలవ్యవధి గురువారంతో ముగిసింది. దీంతో శాస్త్రోక్తంగా అయ్యప్ప దేవాలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవసం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. మకరసంక్రాంతి అనంతరం వారం వ్యవధిలో ఆలయాన్ని మూసివేస్తారు. కుంభ నెల పూజల నిమిత్తం ఆలయాన్ని తిరిగి ఫిబ్రవరి 12న సాయంత్రం 5:30 గంటలకు తెరవనున్నారు. ప్రతి ఏటా.. కార్తీకమాసంలో ఆలయాన్ని తెరిచి భక్తులకు, అయ్యప్ప స్వాములకు దర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి నెలలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఆలయ అధికారిక వెబ్ సైట్ లో డేట్లు సరిచూసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

Also read: Akkineni Nagarjuna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున అమలా దంపతులు

కాగా ఆలయం మూసివేత సందర్భంగా రాజకుటుంబీకులు మూలం తిరున్నాల్ శంకర్ వర్మ.. గురువారం ఉదయం గణపతి హోమం నిర్వహించారు. అనంతరం వంశాచారం ప్రకారం రాజు అయ్యప్ప స్వామిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. సేవల అనంతరం స్వామి వారి “తిరువాభరణం” పందళంలోని ఆలయానికి తరలిస్తారు. నాలుగు రోజుల పాటు ప్రయాణించి తిరువాభరణం ఆదివారానికి పందళం చేరుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Also read: Crime News: “పుష్ప లాగా ఎదగాలని” హంతకులుగా మారిన మైనర్లు