Brahmamgari Matam : దివంగత పీఠాధిపతి మృతిపై అనుమానాలు, శివస్వామి సంచలన కామెంట్స్

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠానికి చేరుకుంది పీఠాధిపతుల బృందం. ఈ సందర్భంగా..పీఠాధిపతుల బృందం కన్వీనర్ శివస్వామి సంచలన కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Brahmamgari Matam : దివంగత పీఠాధిపతి మృతిపై అనుమానాలు, శివస్వామి సంచలన కామెంట్స్

Shivaswamy

Saiva Kshetram Peetadhipathi Siva Swamy : బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠానికి చేరుకుంది పీఠాధిపతుల బృందం. ఈ సందర్భంగా..పీఠాధిపతుల బృందం కన్వీనర్ శివస్వామి సంచలన కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బ్రహ్మంగారి మఠం దివంగత పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. దివంగత పీఠాధిపతి ఆరోగ్యంగా ఉన్నారు..డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్లు ప్రకటించిన మరుసటి రోజే మృతి చెందడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారని తెలిపారు. దివంగత పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మృతిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించడం గమనార్హం. తదుపరి మఠాధిపతి ఎవరు అన్నది తాము ప్రకటిస్తామన్నారు శివస్వామి.

అంతకంటే ముందు..బ్రహ్మంగారి మఠానికి చేరుకున్న పీఠాధిపతుల బృందం ఉదయం వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిని దర్శించుకుంది. 9 గంటలకు ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోన్నారు. దర్శనం తర్వాత అమ్మవారి శాల కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు పీఠాధిపతులు. పీఠాధిపత్యం కోసం రెండు కుటుంబాలు పోటీ పడుతుండగా.. మఠాధిపతుల బృందం చర్చిస్తోంది. మఠాధిపతుల బృందం ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రికి నివేదిక ఇచ్చింది.

Read More : Pangong Tso : పాంగాంగ్‌ సరస్సులోకి 17 పడవలు