Phone Tapping In YSRCP : ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకేముంది? చంద్రబాబుకి ఇది అలవాటే-సజ్జల

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయించడం టీడీపీకి అలవాటే అని ఎదురుదాడికి దిగారు.

Phone Tapping In YSRCP : ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకేముంది? చంద్రబాబుకి ఇది అలవాటే-సజ్జల

Phone Tapping In YSRCP : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయించడం టీడీపీకి అలవాటే అని ఎదురుదాడికి దిగారు. కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకేముందని సజ్జల ప్రశ్నించారు. కోటంరెడ్డి వినిపించిన ఆడియోకి సంబంధించి అతని అనుచరుడిని పిలిపించుకుని మాట్లాడితే నిజాలు తెలుస్తాయని హితవు పలికారు.

టీడీపీతో మాట్లాడుకున్నాక కోటంరెడ్డి మాటలకు విలువ ఏముందని ప్రశ్నించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడం చంద్రబాబుకి అలవాటే అన్నారు. సీఎం జగన్ కు కానీ, వైసీపీకి కానీ ఫోన్ ట్యాపింగ్ చేయించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదన్నారు సజ్జల.

Also Read..MLA Kotamreddy Phone Tapping : సీఎం జగన్, సజ్జల ఆదేశాలు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

కోటంరెడ్డి చెబుతున్న ఎవిడెన్స్ లో వాస్తవం లేదన్నారు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి. తన అనుచరుడితో కోటంరెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ ను రికార్డ్ చేశారని, ఆ ఆడియో రికార్డ్ నే వైసీపీ హైకమాండ్ కు ఓ నేత పంపారని బాలినేని చెప్పారు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని తేల్చి చెప్పారు. ఎందుకు ఇలా మాట్లాడారు అని ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు.. కోటంరెడ్డిని అడిగారని బాలినేని చెప్పారు.

అవసరమైతే కోటంరెడ్డి తన అనుచరుడిని పిలిపించుకుని మాట్లాడితే వాస్తవం తెలుస్తుందన్నారు. ఇష్టం లేకపోతే పార్టీని వీడాలి కానీ, ఆరోపణలు చేయడం ఎందుకు అని బాలినేని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇవ్వలేకపోతే అవమానించినట్లా? అని బాలినేని ఎదురుదాడికి దిగారు.

” ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. తన స్నేహితుడితో కోటంరెడ్డి మాట్లాడారు. ఆ మాటలను కోటంరెడ్డి స్నేహితుడు రికార్డ్ చేశాడు. ఆ రికార్డింగ్ ను నెల్లూరులో కాంగ్రెస్ నేతకు ఇస్తే, ఆ నాయకుడు వైసీపీ హైకమాండ్ కు పంపించాడు. ఈ రకంగా మాట్లాడటం ఎందుకు అని ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు.. కోటంరెడ్డితో మాట్లాడారు. అంతేకానీ, ఫోన్ ట్యాపింగ్ లో వాస్తవం కాదు. ఆ విషయాన్ని శ్రీధర్ రెడ్డి తెలుసుకోవాలి. అవసరమైతే శ్రీధర్ రెడ్డి తన స్నేహితుడిని పిలిచి మాట్లాడితే వాస్తవం తెలుస్తుంది” అని బాలినేని అన్నారు.

Also Read..Phone Tapping In YCP : వైసీపీలో హీట్ పుట్టిస్తోన్న ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. అధిష్టానంతో కోటంరెడ్డి రెడ్డి ఢీ అంటే ఢీ

కాగా, సొంత పార్టీ నేతలే తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపడంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటంరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కొంతమందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే తన ఉద్దేశాలు వెల్లడించిన తర్వాత ఏం చర్యలు తీసుకోగలం? సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారే తప్ప ఫోన్ ట్యాపింగ్ లను నమ్ముకుని కాదు. ఎవరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. పదవి రాలేదన్న అసంతృప్తి ఉండడం వేరు, బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం వేరు” అని సజ్జల అన్నారు.

”టీడీపీ డైరెక్షన్ లోనే కోటంరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. మంత్రి పదవి రాలేదన్న అక్కసుతోనే శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. ఆనంకు సెక్యూరిటీ తగ్గించలేదు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు బాలినేని.